అన్వేషించండి

మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ కనిపించదు: ఈటల

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. నల్గొండలో మాట్లాడుతూ.. కేసీఆర్ దురహంకార, దుర్మార్గ పాలన అంతమవ్వాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు.

Eatala Rajender: మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ కనుమరుగవుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. మునుగోడు ఎన్నిక తర్వాత రాజకీయ ప్రళయం వస్తుందని వ్యాఖ్యానించారు. అనేకమంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్లు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. నల్గొండలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

పార్టీ ఫిరాయింపుల మీద బ్రతుకున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ది అని ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్‌లో చేసినట్లు నల్గొండలోనూ గ్రామగ్రామానికి, ఇంటింటికీ ఇంటెలిజెన్స్ వారిని పంపించి కౌన్సిలింగ్ చేస్తున్నారని అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని.. పార్టీ మారకుండానే మంత్రులను చేసిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని విమర్శించారు.

కేసీఆర్ అబద్ధాల గురించి ప్రజలకు తెలుసు

నల్గొండ జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ చెప్పే అబద్ధాల గురించి ఇక్కడి ప్రజలకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. కేసీఆర్ అహంకారం పోవాలి అంటే ఇక్కడ రాజగోపాలరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా దురహంకార, దుర్మార్గ పాలన పోవాలని కోరుకుంటున్నారని ఈటల అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే పింఛన్లు పోతాయని బెదిరిస్తున్నారని.. హుజురాబాద్ లో ఏమైనా పోయాయా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ఆరిపోతున్న దీపమని.. ప్రజలతో ఛీ కొట్టించుకుంటున్న పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. 

గతంలో కూడా ఈటల రాజేందర్ ఇలాంటి సంచలన కామెంట్స్‌ చేశారు. కేసీఆర్ ఉండేది మూడు నెలలే అంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా 3 నెలలే ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామంలో ప్రజాగోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో ఈటల రాజేందర్, ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. కేసీఆర్ ఉపఎన్నికలు ఉంటే తప్ప ఫౌంహౌజ్ నుంచి బయటికిరాడని ఈటల విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టని ప్రభుత్వం.. విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తుందనుకోవడం భ్రమేనన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తెలివైనవారని.. కేసీఆర్ జిమ్మిక్కులు బాగా అర్థమై ఉంటాయని ఈటల అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలచేతిలో కేసీఆర్కి పరాభవం తప్పదన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget