అన్వేషించండి

Munugode Bypoll : నేడు మునుగోడు కౌంటింగ్, 21 టేబుళ్లపై 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకానుంది.

Munugode Bypoll : తెలంగాణలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 6వ తేదీన నల్లగొండ శివారు ఆర్జాలబావి స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, కౌంటింగ్‌ హాళ్లలో వసతులు కల్పించామని ఎన్నికల సంఘం తెలిపింది.  ఒకే హాల్‌లో 21  టేబుళ్లపై 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలయ్యే కౌంటింగ్‌ మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 3వ తేదీన జరిగిన ఉపఎన్నికలో మొత్తం 2,41,855 ఓట్లకు గాను 2,25,192 ఓట్లు (93.16 శాతం) పోలైయ్యాయని అధికారులు తెలిపారు. 

మధ్యాహ్నం 1 గంటకు కౌంటింగ్ పూర్తి 

మునుగోడు పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపర్చారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలు పహారా కాస్తున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణా రెడ్డి లెక్కింపు అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. కౌంటింగ్‌ టేబుళ్ల వద్ద అభ్యర్థులు లేదా పార్టీ ఏజెంట్లు కూర్చోడానికి అనువుగా అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు అభ్యర్థులు లేదా పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరుస్తారు. ముందుగా ఆర్.ఓ టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు. 7 మండలాల్లో మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాల్లో 298 ఈవీఎంలను ఓటింగ్ లో ఉపయోగించారు. గంటకు 3 నుంచి 4 రౌండ్ల ఫలితాలు ప్రకటించనుండగా,  మధ్యాహ్నం 1 గంటకల్లా  కౌంటింగ్‌ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.  

15 రౌండ్లలో కౌంటింగ్ 

మునుగోడు  ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి  వికాస్ రాజ్ శనివారం తెలిపారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను 6వ తేదీ ఉదయం 7:30 గంటలకు అబ్జర్వర్, పోటీ చేసిన అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో తెరుస్తామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు.  ఓట్ల లెక్కింపు ఆదివారం  ఉదయం 8:00 గంటలకు నల్గొండ జిల్లా అర్జాలబావి తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ చేపట్టనున్నట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.  పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత, EVM లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. 21 టేబుళ్లను ఏర్పాటు చేసి 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. ప్రతి రౌండ్ కౌంటింగ్‌లో, అబ్జర్వర్ టేబుల్‌పై రిజల్ట్ షీట్‌తో ఎంచుకున్న 2 పోలింగ్ స్టేషన్‌ల ఫలితాన్ని క్రాస్ చెక్ చేస్తారు. EVM కౌంటింగ్ పూర్తయిన తర్వాత,  VVPAT  కౌంటింగ్ బూత్  వద్ద ఎంపిక చేసిన 5 VVPAT స్లిప్‌లను తప్పనిసరిగా లెక్కించాలని సీఈఓ ఆదేశించారు. మునుగోడు ఉపఎన్నికలో 298 పోలింగ్ స్టేషన్లలో మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయి. 680 పోస్టల్ బ్యాలెట్లను 80 ఏళ్లు పైబడిన ఓటర్లు, వికలాంగులు వేశారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రెండింటికీ 150 సీటింగ్ కెపాసిటీతో ప్రత్యేక హాలు ఏర్పాటు చేశారు. ఈ హాలులో మైక్-సెట్, స్క్రీన్‌తో రౌండ్ వారీగా ఫలితాన్ని ప్రదర్శించేందుకు సదుపాయం ఉందని సీఈఓ తెలిపారు

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
KTR Passport Seized: ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !
ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Embed widget