అన్వేషించండి

KCR : కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్- వీడియో వైరల్

KCR Latest News: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు (KCR) నడక సాధన చేస్తున్నారు. ఫిజయోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ చేతి కర్ర సాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. 

KCR Is Walking With Stick: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) అధినేత చంద్రశేఖరరావు (KCR) నడక సాధన చేస్తున్నారు. ఫిజయోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ చేతి కర్ర సాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్ తన  ‘ఎక్స్‌’ ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. కాలు తొంటి శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ కొద్ది రోజులు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు. గత నాలుగు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా మర్కూర్‌ మండలం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌‌కు వెళ్లి అక్కడ కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. 

బీఆర్ఎస్ కార్యకర్తల ఆనందం
చాలా రోజుల వరకు మంచానికే పరిమితమైన కేసీఆర్ చేతి కర్ర సహాయంతో నడుస్తున్న వీడియోను బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. వైద్యులు సలహాలు ఇస్తుండగా కేసీఆర్ నడుస్తున్న వీడియోను ఆయన అభిమానులు తమ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. కేసీఆర్ కోలుకుంటున్నారని, మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసిఆర్ నడుస్తున్న వీడియోకు ఫైటర్, రెసీలియంట్, స్ట్రాంగ్ కేసీఆర్ అనే ట్యాగ్‌లను జత చేశారు.  

డిసెంబర్ 8న శస్త్ర చికిత్స
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు డిసెంబర్ 7వ తేదీ రాత్రి ఆయన ఇంట్లో కాలు జారి కింద పడ్డారు. వెంటనే ఆయన్ను సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్‌కు తరలించారు. 8వ తేదీ వైద్యులు ఎడమ తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు.  సీనియర్ ఆర్ధోపెడిక్ సర్జన్లు, అనెస్థీషియన్లతో కూడిన టీం ఆయనకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత ఆయన కోలుకునేందుకు కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని వెల్లడించారు. 

మరుసటి రోజు మరోసారి పరీక్షించి ఫిజియో థెరపీ, పౌష్టికాహారంపై సూచనలు చేశారు. ఆపరేషన్ తరువాత కేసీఆర్ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత మరుసటి రోజు కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్‌ సాయంతో మెల్లగా అడుగులు వేశారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ ఆరోగ్యం మెరుగుపడిందని, మానసికంగా కూడా కేసీఆర్‌ దృఢంగా ఉన్నారన్నారు.    

మందుల వ్యాపారికి కేసీఆర్ ఫోన్
ఇటీవల కేసీఆర్ తన ఫామ్ హౌస్ పరిసర ప్రాంతానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి బాబు రెడ్డికి ఫోన్ చేశారు. తాను కోలుకుంటున్నానని.. పది రోజుల్లో ఫామ్ హౌస్‌కి వస్తానని మాట్లాడారు. ఈ సారి ఫామ్‌హౌస్‌లో బొప్పాయి పంట సాగు చేద్దామని చెప్పారు. అందుకు తగిన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రస్తుతం ఏఏ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి? నాణ్యమైన విత్తనాల గురించి బాపురెడ్డిని ఆరా తీశారు. కేసీఆర్ ఫోన్ చేయడంతో బాపురెడ్డి ఆనందానికి అవధులు లేవు. కేసీఆర్ కోరినట్టుగానే విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తానని వివరించారు.  

టాప్ హెడ్ లైన్స్

Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AE Nookaraju Family Suicide Case: సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
Embed widget