అన్వేషించండి

Aravind Vs Kavita : అరవింద్ .. చెప్పుతో కొడతా - నిజామాబాద్ ఎంపీకి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ! యుద్ధం ప్రారంభమైనట్లే ..

పద్దతిగా మాట్లాడకపోతే ధర్మపురి అర్వింద్‌ను చెప్పుతో కొడతానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఖర్గేతో సంప్రదించారని అర్వింద్ చేసిన ఆరోపణలపై కవిత స్పందించారు.

Aravind Vs Kavita :  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జాగ్రత్తగా.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే చెప్పుతో కొడతానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె ..   ధర్మపురి అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే వెంటపడి కొడతామన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే అర్వింద్‌ను వెంటపడి కొడతామన్నారు.పరిధి దాటితే మెత్తగా తంతామన్నారు. తమాషాలు చేస్తే ఊరుకోబోమన్నారు. ఇంకో సారి లైన్ దాటి మాట్లాడితే..   కొట్టి కొట్టి చంపుతామని హెచ్చరించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి రైతులను మోసం చేసిన ధర్మపురి అర్వింద్ పై రైతులు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయనపై పోటీ చేసిన అభ్యర్థిగా తానే ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. నిజామాబాద్‌లోనే కాదు.. ధర్మపురి అరవింద్ ఎక్కడ పోటీ చేసినా తాను అక్కడి నుంచి పోటీ చేసి ఓడిస్తానన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే... నిజామాబాద్ దౌరస్తాలోనే చెప్పుతో కొడతానన్నారు. మాట తప్పినందుకు  రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలన్నారు. 

హైదరాబాద్‌లోని ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి !

ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు..   టీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేశారు. పెద్ద ఎత్తున ముట్టడికి వెళ్లారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు , ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దాడి జరుగుతున్న సమయంలో ఎంపీ అర్వింద్ నిజామాబాద్‌లో ఉన్నారు. తర్వాత అక్కడకు  వచ్చిన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్ని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో  గంటకు పైగా ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. 

కాంగ్రెస్‌లో చేరేందుకు కవిత ప్రయత్నించారని అర్వింద్ ప్రకటనతో వివాదం 

గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ధర్మపురి అర్వింద్  కాంగ్రెస్‌లో చేరాతనని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  ఫోన్ చేశారని ఆరోపించారు. తన తండ్రి మీద అలిగిన కవిత కాంగ్రెస్ లో చేరతానని.. మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేశారని అన్నారు.  ఈ విషయం తెలిసిన కేసీఆర్.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చనిపోయినప్పుడు కవితను తన వెంటే లక్నోకు తీసుకెళ్లారన్నారు. తన కూతురు తన వెంటే ఉన్నారని చెప్పేందుకు మీడియా ముందు డ్రామా  ఆడారన్నారు. కవిత, కేటీఆర్ లను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రాన్ని, కేసీఆర్ ను కేటీఆర్, కవిత  భ్రష్టుపట్టించారన్నారు. ఈ వ్యాఖ్యలపైనా టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. 

కవితను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన అర్వింద్ !

ధర్మపురి అర్వింద్.. కవిత కాంగ్రెస్‌లో చేరుతారని చేసిన ప్రకటనకు.. కారణం .. అంతకు ముందు టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్..  కవితను కూడా బీజేపీలో చేరాలని అడిగారని.. ఇంత కంటే ఘోరం ఉంటుందా అని పార్టీ నేతలతో అన్నట్లుగా ప్రచారం జరిగింది. దీనపై బీజేపీ నేతలు రకరకాలుగా స్పందించారు. కవిత కాదు..కేసీఆర్ వచ్చినా తమ పార్టీలో చేర్చుకునేది లేదన్నారు. అయితే అర్వింద్ మాత్రం మరో అడుగు ముందుకేసి ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని చెప్పడం కలకలం రేగింది. 


 

 

టాప్ హెడ్ లైన్స్

Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
Breaking News: టీమిండియాకు బిగ్ షాక్.. టీ20 సిరీస్ సొంతం చేసుకున్న ఐర్లాండ్
టీమిండియాకు బిగ్ షాక్.. టీ20 సిరీస్ సొంతం చేసుకున్న ఐర్లాండ్
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget