Jagadish Reddy: అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను వెంటనే తొలగించాలి - మంత్రి జగదీశ్ రెడ్డి
పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తుందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారని అన్నారు.
ప్రశ్న పత్రాల లీకేజీలో అడ్డంగా దొరికిపోయారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తక్షణమే అధ్యక్ష పదవి నుండి తొలగించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రశ్నా పత్రాల లీకేజీలో రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరం అని అన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికిన కూడా బీజేపీ నాయకులు బండిని సమర్ధించడం సిగ్గు చేటని మంత్రి హెద్దేవా చేశారు. పోలీస్ స్టేషన్ లోకి చోచ్చుకెళ్ళి దొంగను రక్షించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని అన్నారు.
పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తుందని ఆరోపించారు. పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ క్షుద్ర రాజకీయ క్రీడకు తెరలేపిందని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు బీజేపీ ట్రాప్ లో పడొద్దని మంత్రి కోరారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న బీజేపీని గ్రామగ్రామాన ప్రజలు నిలదీయాలని పిలుపు నిచ్చారు. యువత, విధ్యార్ధులను బీఆర్ఎస్ నుండి దూరం చేసే కుట్ర జరుగుతుంది అన్నారు.