అన్వేషించండి

Minister Harishrao: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకెళ్లడం పక్కా, సుప్రీం తీర్పు వేళ మంత్రి హరీష్ సంచలనం

Minister Harishrao: ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని మంత్రి హరీష్ రావు తెలిపారు. సుప్రీంకోర్టులో కూడా రేవంత్ రెడ్డికి రిలీఫ్ దొరలేదని అన్నారు.

Minister Harishrao: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల మధ్య మాటల వార్ హీట్ పుట్టిస్తోంది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండటంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఎన్నికల ప్రచారం మొదలుకాకముందే రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం కాక రేపుతుండగా.. ఎన్నికల షెడ్యూల్ వచ్చి ప్రచారపర్వం మొదలుపెట్టిన తర్వాత నేతల మాటల తూటాలు మరింతగా రాజకీయాలను వేడెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మరోసారి జైలుకెళ్లడం ఖాయమని ఆరోపించారు. సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట లభించలేదని, ఈ కేసు విచారణ కొనసాగించాలని న్యాయస్థానం చెప్పిందన్నారు. ఈ కేసులో విచారణ జరగుతుందని, భవిష్యత్తులో రేవంత్ జైలుకెళ్లడం పక్కా అని తెలిపారు. ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ పట్టుబడ్డ రేవంత్ తప్పనిసరిగా విచారణను ఎదుర్కొవాల్సిందేనని, ఆయన ఒక దొంగ అని ఘాటుగా విమర్శలు కురిపించారు. ఈ కేసు విచారణ ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ సుప్రీంకోర్టుకెళ్లినా అక్కడ రిలీఫ్ దొరలేదని, ఇంకా ఆయనను ఈ కేసులో ఎవరూ తప్పించలేరని అన్నారు.

డబ్బులు పంచి గెలవాలని రేవంత్ చూస్తున్నారని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని హరీష్ రావు అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ఇవాళ 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి మంత్రి హరీష్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ గెలిచే పరిస్థితి లేదని, బీఆర్ఎస్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వేను చూసినా బీఆర్ఎస్‌నే అధికారంలోకి వస్తుందని చెబుతుందని, బీఆర్ఎస్ గెలుపులో ఎలాంటి అనుమానం లేదన్నారు. తమ ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. 3 గంటల కరెంట్ చాలని రేవంత్ తన కడుపులోని మాటను బయటపెట్టారన్నారు. కొండగల్‌లో రేవంత్ ఏమీ చేయలేదని ప్రజలు ఓడిస్తే.. మల్కాజ్‌గిరి వెళ్లారని విమర్శించారు. 

కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి కూడా తీసుకురాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో మూడు ఆస్పత్రులను మంజూరు చేసినట్లు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీటిని అందిస్తున్నామని, రేవంత్ రెడ్డి పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసి ఒక్క ఇంటికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు.  వ్యవసాయం దండగ అని అప్పట్లో చంద్రబాబు అంటే, రైతులకు ఉచిత కరెంట్ దండగ అని రేవంత్ అన్నారని ఆరోపించారు. 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని హరీష్ సూచించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని ఇక్కడి నేతలు చెబుతున్నారని, కర్ణాటకలో కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, గృహలక్ష్మి వంటి పథకాలు ఉన్నాయా? అని హరీష్ ప్రశ్నించారు. త్వరలోనే తమ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని, అందులో మహిళల కోసం ప్రత్యేక పథకాలు ఉంటాయన్నారు. మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసే దిశగా తమ పార్టీ మ్యానిఫెస్టోలోని హామీలు ఉంటాయని హరీష్ పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GHMC Offer: గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
Netflix in Hyderabad: హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
Speaker Decision: అనర్హత, రాజీనామాల విషయంలో స్పీకర్‌కు గడువు - బీఆర్ఎస్ పిటిషన్లతో క్లారిటీ - ఇక పెండింగ్ పెట్టలేరా ?
అనర్హత, రాజీనామాల విషయంలో స్పీకర్‌కు గడువు - బీఆర్ఎస్ పిటిషన్లతో క్లారిటీ - ఇక పెండింగ్ పెట్టలేరా ?
Nirmal District Latest News: శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు!నిర్మల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం! ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు!
శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు!నిర్మల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం! ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు!

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Embed widget