అన్వేషించండి

Errabelli Dayakar Rao: బీఆర్‌ఎస్‌దే గెలుపు, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: తెలంగాణలో మూడో సారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 80 నుంచి 90 సీట్లు గెలుస్తుందన్నారు.

Errabelli Dayakar Rao: తెలంగాణలో మూడో సారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 80 నుంచి 90 సీట్లు గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు విశ్వసించడం లేదని, రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కడతారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా కాంగ్రెస్‌ అభ్యర్థల జాబితా ప్రకటించడానికి సతమతమవుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో కొత్తవారి రాకతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న అభ్యర్థులు టికెట్లు కోల్పోయే పరిస్థితి నెలకొందని అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌తో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొందని ఎర్రబెల్లి అన్నారు. అందుకే ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదన్నారు. అభ్యర్థులను ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుందన్నారు. బీఆర్‌ఎస్‌లో సీట్లు ఆశించి దక్కని వారికి అధిష్టానం నచ్చచెప్పిందని, కానీ కాంగ్రెస్ పరిస్థితి అది కాదన్నారు. మైనంపల్లి హనుమంత రావు పరిస్థితిని ఉదహరిస్తూ... కాంగ్రెస్‌లో చేరిన తరువాత మైనంపల్లి రెండు సీట్లు అడిగితే అప్పటి వరకు ఆ పార్టీలో చేసిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినక తప్పదన్నారు. 

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారెంటీలతో తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్షన్ రూ.350 నుంచి 600 లోపే ఉందని, కానీ తెలంగాణలో నాలుగువేలు ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు. ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నాలుగు వేల పించన్ ఇవ్వాలని హితవు పలికారు. అక్కడ గ్యాస్ రూ.500కే ఇస్తే తెలంగాణలో నమ్ముతారని అన్నారు. హామీలు ఇచ్చిన వారు వారి పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారో లేదో ఆధారాలు చూపిస్తే ప్రజలు నమ్ముతారని అన్నారు. కానీ బీఆర్ఎస్ అలా కాదన్నారు.

తాము మేనిఫెస్టోలో పెట్టినవి, పెట్టనవి కూడా చేశామన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పలేదని, కాళేశ్వరానికి నీరు, రైతు బంధు, మిషన్ భగీరథ ఇస్తామని చెప్పలేదని కానీ అవన్నీ చేశామన్నారు. ప్రజలకు ఏవైతే అవసరమో అవన్నీ చేసి చూపించామన్నారు. దేశంలో తెలంగాణ అమలు చేసినన్ని పథకాలు ఏ రాష్ట్రంలోను లేవన్నారు. ఎన్నికల సంబర్భంగా అన్ని వర్గాల కోసం సంక్షేమ మేనిఫెస్టో ప్రవేశ పెట్టనున్నట్లు దయాకర్ రావు తెలిపారు. గృహ లక్ష్మి కింద పేదలకు ఇళ్లు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. బీసీ బంధు, దళిత బంధు, మైనారిటీల కోసం పథకాలతో బీఆర్ఎస్ మేనిఫెస్టో దద్దరిల్లుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం బాగా ఉందని ఎర్రబల్లి వెల్లడించారు. రాష్ట్రంలో పేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలో లీడర్లకే దిక్కులేదని, అందుకే బీఆర్ఎస్ నుంచి వెళ్లిన 30 నుంచి 40 మందికి టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నా నాయకులు లేరని అన్నారు. బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. నాలుగైదు సీట్లకు మించి రావని అన్నారు. బీఆర్ఎస్‌కు  80 నుంచి 90 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇది తనకు ఉన్న రాజకీయ అనుభవంతో చెబుతున్నానని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు నీళ్లు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు నీళ్లు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget