అన్వేషించండి

Medicover Hospitals: 16 నెలల చిన్నారికి అరుదైన సర్జరీ, ఇండియాలో తొలిసారి చేసిన మెడికవర్ డాక్టర్లు

భారతదేశంలో మొట్టమొదటిసారిగా మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ లో పీడియాట్రిక్ వైద్య విభాగం వైద్యులు ఈ అరుదైన సర్జరీ చేశారు.

హైదరాబాద్: పుట్టుకతో వచ్చిన వైకల్యంతో (శరీరం వెలుపల గుండెతో మరియు ఉదరభాగంతో) జన్మించిన 16 నెలల శిశువుకి విజయవంతంగా సర్జరీ చేసి పాప ప్రాణాలను కాపాడారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ లో పీడియాట్రిక్ వైద్య విభాగం వైద్యులు ఈ అరుదైన సర్జరీ చేశారు. టాంజానియాకు చెందిన 16 నెలల చిన్నారికి అరుదైన పుట్టుకతోవచ్చిన వైకల్యంతో జన్మించిన చిన్నారికు పీడియాట్రిక్ కార్డియాక్ సైన్సెస్ టీమ్ మరియు పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ టీమ్ విజయవంతంగా సర్జరీ చేసి పాప ప్రాణాలను కాపాడారు. 

గుండె, ఛాతీ ఉదర భాగాలను ప్రభావితం చేసే సంక్లిష్ట లోపాలతో పాప జన్మించింది. ఆ పాపకు గుండె ఛాతీ కుహరం వెలుపల కొట్టుకోవడం, చర్మంతో మాత్రమే కప్పి ఉండటం, పేగులు, ఇతర ఉదర అవయవాలు బయటకు పొడుచుకు వచ్చాయి. పెంటలజీ ఆఫ్ కాంట్రెల్ (POC) అని పిలువబడే ఈ పరిస్థితి డాక్టర్స్ కు సవాలుతో కూడుకున్నది. కాంట్రెల్ యొక్క పెంటాలజీ అనేది చాలా అరుదైన పుట్టుకతో వచ్చే రుగ్మత. ఇది దిగువ స్టెర్నమ్, డయాఫ్రాగమ్, పొత్తికడుపు గోడ, పెరికార్డియం మరియు గుండెకు సంబంధించిన మధ్యరేఖ లోపాల కలయికతో ఉంటుంది. దీనిని సరిచేయడానికి మల్టీడిసిప్లినరీ విధానం, ప్రత్యేక శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. సర్జరీ సక్సెస్ చేయడం సవాలుతో కూడుకున్నది. ముఖ్యంగా SPO2 95% ఉండాలి కానీ ఈ చిన్నారికి 63 శాతం ఉండటం పెద్ద సవాలుగా మారింది. సాధారణంగా ఆక్సిజనేటెడ్ రక్తం ఎర్రగా కనిపించే ధమనులు గుండె నుండి రక్తాన్ని సరఫరా చేస్తాయి. డీఆక్సిజనేటెడ్ రక్తం నీలం రంగులో కనిపించే సిరలు గుండెకు రక్తాన్ని తిరిగి పంపుతాయి. అది పూర్తి పరిణామం చెందలేదు. ఈ చిన్నారికు జఠరిక ఒక్కటే ఉండటం వల్ల రక్తాన్ని ఇతర భాగాలకు పంపించడం మాత్రమే జరుగుతుంది. నీలం రంగులో ఉండే రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపటానికి ప్రత్యేక సిరల ద్వారా లంగ్స్ కి అమర్చారు. 


Medicover Hospitals: 16 నెలల చిన్నారికి అరుదైన సర్జరీ, ఇండియాలో తొలిసారి చేసిన మెడికవర్ డాక్టర్లు
పీడియాట్రిక్ కార్డియాలజీ, పీడియాట్రిక్ సర్జరీలలో ప్రత్యేకత కలిగిన అత్యంత శిక్షణ పొందిన సర్జన్ల రెండు బృందాలు 14 గంటల పాటు సర్జరీ చేశాయి. TIBA హాస్పిటల్ సహకారంతో టాంజానియాలోని దార్ ఎస్ సలామ్‌లోని మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ ఔట్‌రీచ్ OPDలో రోగి నిర్ధారణ అయింది. శస్త్రచికిత్స కోసం చిన్నారిని భారత్‌కు తీసుకువచ్చారు. చికిత్సకు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు, CVT సర్జన్‌లు, పీడియాట్రిక్ సర్జన్‌లు, ప్లాస్టిక్ సర్జన్‌లు, పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థటిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లు మరియు నర్సింగ్ సిబ్బందితో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం నైపుణ్యం అవసరం. అంతా కలిసి పాపకు సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు.
డాక్టర్ ఆశిష్ సప్రే, డాక్టర్ శ్రీనివాస్ కిని, డాక్టర్ మధు మోహన్ రెడ్డి, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే, డాక్టర్ పవన్ ప్రసాద్, డాక్టర్ మధు వినయ్, డాక్టర్ సంధ్య (పీడియాట్రిక్ అనస్థీసిస్ట్ ), డాక్టర్ నిర్మల్ రెడ్డి (పీడియాట్రిక్ అనస్థీసిస్ట్), మెడికవర్ ప్రత్యేక నర్సింగ్ బృందం ఫిబ్రవరి 22న చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు 10 రోజులలోపు డిశ్చార్జికి చిన్నారి సిద్ధంగా ఉంది. 

పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ సప్రే మాట్లాడుతూ.. ఇంత చిన్న పేషెంట్‌లో అత్యంత క్లిష్టతరమైన అరుదైన పుట్టుకతో వచ్చే లోపానికి సర్జరీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ మల్టీడిసిప్లినరీ స్పెషలిస్ట్ టీమ్ మధ్య సహకారం, మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ మరియు యాజమాన్యం సహకారంతో సర్జరీ విజయవంతం చేశామన్నారు. 55 లక్షల మందిలో ఒక్కరే ఇలా పుడతారని, ఇప్పటివరకూ ప్రపంచంలో 90 మందికి ఇలా జరిగిందని మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్ లో  పీడియాట్రిక్ సర్జరీ విభాగం హెడ్ డాక్టర్ మధు మోహన్ రెడ్డి.బి తెలిపారు. భారతదేశంలో ఈ చిన్నారికి జరిగిన సర్జరీ మొట్టమొదటిది. ఈ సర్జరీతో మరెన్నో క్లిష్టతరమైన కేసులకు పరిష్కారం చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో సవాళ్లతో కూడిన కేసును విజయవంతంగా పరిష్కరించామని CVT సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ కిని అన్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పీడియాట్రిక్ రోగులకు మల్టీస్పెషాలిటీ సంరక్షణను అందించడంలో మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ తన ప్రతేకతను చాటుకున్నది.

టాప్ హెడ్ లైన్స్

DA For Telangana Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2 డీఏలు విడుదలకు ఉత్వర్వులు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2 డీఏలు విడుదలకు ఉత్వర్వులు
KCR Farmhouse: ఎర్రవల్లిలో 45 ఎకరాలు మాయం.. మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసు ఇస్తారా..?
ఎర్రవల్లిలో 45 ఎకరాలు మాయం.. మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసు ఇస్తారా..?
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Shreyas Iyer Breaks Virat Kohli Record: కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Embed widget