అన్వేషించండి

KTR Vs Revanth : బొగ్గు గనుల వేలంపై రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే - కేటీఆర్ రివర్స్ కౌంటర్ ఇదే !

Telangana News : బొగ్గు గనుల వేలంపై రేవంత్ ప్రకటనను కేటీఆర్ తప్పు పట్టారు. అబద్దాలు చెప్పి తెలంగాణ సంపదను దోచేస్తున్నారని మండిపడ్డారు.

Telangana Coal Politics : తెలంగాణ బొగ్గు గనుల  వేలం  విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే సింగరేణికి సమస్యలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రేవంత్ రెడ్డి పైన,  ఆయన చేస్తున్న అబద్ధాల పైన బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్, ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్ధాల ప్రచారం చూసి జోసెఫ్ గోబెల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ తమ పార్టీ అన్న కేటీఆర్, మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా, వాటిని క్రూరంగా అణిచి, వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.  ముఖ్యమంత్రి గద్దెపై రేవంత్ ఎక్కిన తర్వాత కాంగ్రెస్ బిజెపి కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న తీరు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. 

బొగ్గు గనుల వేలాన్ని ప్రతీ సారి వ్యతిరేకించామన్న కేటీఆర్ 

బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ,  బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనుల వేలాన్నిఎల్లప్పుడూ వ్యతిరేకించింది అని తెలిపిన కేటీఆర్ అందుకే ప్రభుత్వం ఏ రోజు వేలంలో పాల్గొనలేదన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిసిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ కొడుతుందని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతోని తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని, కానీ బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించడంతో ఇప్పటిదాకా అక్కడ నుంచి ఒక తట్టెడు బొగ్గు కూడా ఆ కంపెనీలు ఎత్తలేదని తెలిపారు. 

ఆరోపణలు చేస్తున్న కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో గనులు సొంతం చేసుకోలేదా ?

వేలంలో గనులను దక్కించుకున్న రెండు కంపెనీలు కేవలం బిఆర్ఎస్ పార్టీ సింగరేణి ప్రయోజనాల కోసం నిలబడడంతోనే మైనింగ్ ప్రారంభించలేమన్నారు. కేంద్రంలోని బిజెపి గనులను కేటాయించిన, కేవలం రాష్ట్ర ప్రభుత్వ కఠిన వైఖరి వల్లనే నిబద్ధత వల్లనే ఆ కంపెనీలు సింగరేణి బొగ్గును తవ్వలేకపోయాయని ఆ పూర్తి క్రెడిట్ బి ఆర్ ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. కానీ రేవంత్ పేర్కొన్న ఆ రెండు కంపెనీలు మహారాష్ట్రలో కాంగ్రెస్ మరియు శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టాక్లి, జెన, బెల్లోర గనులను దక్కించుకున్న విషయం మర్చిపోవద్దని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. 

తెలంగాణ హక్కుల్ని తాకట్టు పెడతున్న బీజేపీ, కాంగ్రెస్ 

తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయన్నారు. ఇప్పటికే నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారన్నారు. తాజాగా బిజెపికి మీరు అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలన్న మీ కుట్ర అందరికీ తెలిసిపోయిందన్నారు.  గనుల వేలంలో పాల్గొన్న మిమ్మల్ని, మీ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని, తెలంగాణ రాష్ట్రానికి మీరు, మీ జాతీయ పార్టీలు చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన సమయంలో బలమైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
Villa Orchids Security Failure: కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget