అన్వేషించండి

KTR : రెండో సారి మోసపోతే మనదే తప్పు - కాంగ్రెస్‌ను నమ్మవద్దని కేటీఆర్ హెచ్చరిక

Telangana News : చేసిన పనులు చెప్పుకోలేక ఓడిపోయామని కేటీఆర్ అన్నారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జున సాగర్ లో కేటీఆర్ మట్లాడారు.

Telangana Graduate MLC Election :    రైతు భరోసా, రుణమాఫీ, మహాలక్ష్మి, ఫించన్లు, 2 లక్షల ఉద్యోగాలు అంటూ ఇన్ని హామీలిచ్చి మోసం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పకపోతే మనదే తప్పు అవుతదని కేటీఆర్ ప్రజల్ని హెచ్చరించారు.  వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జున సాగర్ లో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో  కేటీఆర్ మట్లాడారు.  డిసెంబర్ 9 నాడే రుణమాఫీ అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు మాత్రం ఊసరవెళ్లి లాగా తేదీలు మారుస్తున్నాడని మండిపడ్డారు.  ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండో సారి మోసపోతే మాత్రం మోస పోయిన వాళ్లదే తప్పు అవుతదని..  అరచేతిలో వైకుంఠం చూపి ఆరు గ్యారంటీలు అని అధికారంలోకి వచ్చారని  ఆరోపించారు.  

సిగ్గులేకుండా ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశామని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని..  పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని సొంత ఇళ్లు కట్టుకుంటే ఎంతో శ్రద్ధగా చేస్తామో అలాగే అభివృద్ధి చేశామన్నారు.  అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని..   తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుంది అన్నట్లుగా అభివృద్ధి చేశామన్నారు.  ఓ వైపు అభివృద్ధిని, మరోవైపు సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టించామన్నారు.  కేసీఆర్  ఉన్నప్పుడు పదేళ్ల పాటు కృష్ణానది ప్రాజెక్ట్ లను కృష్ణా రివర్ మేనేజ్ బోర్డుకు అప్పగించాలని ఒత్తిడి తెచ్చిన వారికి అప్పగించలేదన ిగుర్తు  చేశారు.  కానీ రేవంత్ రెడ్డి వచ్చిన నెల రోజుల్లోనే దొంగచాటుగా సంతకం పెట్టి కేఆర్ఎంబీ కి మన జుట్టును అప్పగించిండని మండిపడ్డారు. 
 
నల్గొండ జిల్లాలో 30 వేల ఎకరాల పంట ఎండిపోతుంటే...ఒక్క తడి ఇవ్వకుండా కిందికి నాలుగున్నర టీఎంసీల నీళ్లు ఎట్ల పోయినయని కేటీఆర్ పఱ్సనించారు.  ప్రశ్నించే గొంతు అని చెప్పుకునే మల్లన్న, పుల్లన్న దీనిపై ఒక్కసారైనా అడిగిండా అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ నాయకుల పరిస్థితి సిట్ అంటే సిట్టు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో.  .. మీ జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఈ మల్లన్న మాట్లాడగలుగుతారా అని ప్రశ్నించారు.  నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో...రేవంత్ రెడ్డి మాటల్లో కూడా అంతే నిజాయితీ ఉందని..  75 శాతం పండించే దొడ్డు వడ్లకు బోనస్ లేదంట. అంటే వీళ్ల మాటలు బోగస్ అని తేలిపోయిందన్నారు. 
 
  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో కోటి 67 లక్షల మంది మహిళలకు రూ. 2500 లు ఇస్తున్నామని పచ్చి అబద్దాలు చెబుతున్నారని.. చేయని పనులను కూడా చేస్తున్నామని ఈ సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా చెప్పుకుంటోందని విమర్శించారు.  2014 లో ఐటీ ఉద్యోగులు ఉంటే 2023 చివరి నాటికి 10 లక్షల మంది ఉద్యోగులు అయ్యారుని..  2023 నాటికి ఐటీ ఎగుమతులు ఐదు రెట్లు పెంచామన్నారు.  పారిశ్రామిక రంగంలో కూడా ఎన్నో పెట్టుబడులు తెచ్చి దాదాపు 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని గుర్తుచేశారు.  

 కాంగ్రెస్ తప్పుడు హామీలు, యూట్యూబ్ తప్పుడు ప్రచారాల కారణంగా స్వల్ప తేడాతో ఓడిపోయామని..  పని చేసి కూడా మనం సరిగా చెప్పుకోలేకపోయాం. అందుకే ఓడిపోయామని విశ్లేషించారు.   ఇలాంటి మోసపూరితమైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇప్పుడు అధికార స్వరాలు కాదు...ధిక్కార స్వరాలు కావాలన్నారు.  కాంగ్రెస్ అభ్యర్థి చదువుకున్నాడో లేదో తెలియదు. గానీ బ్లాక్ మెయిలింగ్ చేసే తెలివి అయితే ఉందన్నారు.  ఐఐటీలు, నిట్, ప్రభుత్వ సర్వీసులు, తెలంగాణ ఉద్యమం ఇలా అన్ని వర్గాల నుంచి బీఆర్ఎస్ లో నాయకులు ఉన్నారని..  బీఆర్ఎస్ లో చదువుకున్న వారికి అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు.  ఈ నెల 27 న విద్యావంతుడైన రాకేష్ రెడ్డి కి ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ కోరారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nizamabad Road Accident: నిజామాబాద్‌ జిల్లాలో NH 44పై ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి నలుగురి మృతి
నిజామాబాద్‌ జిల్లాలో NH 44పై ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి నలుగురి మృతి
Allu Arjun - Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్ రాణించాలి -  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్ రాణించాలి -  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy Greater Election Strategy: మూడు ఒకే సారి కాదు..విడివిడిగా ఎన్నికలు - గ్రేటర్ కార్పొరేషన్లలో పట్టు కోసం రేవంత్ మాస్టర్ ప్లాన్
మూడు ఒకే సారి కాదు..విడివిడిగా ఎన్నికలు - గ్రేటర్ కార్పొరేషన్లలో పట్టు కోసం రేవంత్ మాస్టర్ ప్లాన్
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
Gas Charge In Hotel Bills: LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Iran Israel War: ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Embed widget