అన్వేషించండి

KTR Tweets: ఐటీ మినిస్టర్‌.. సమస్యల పరిష్కారంలో ట్రెండ్ సెట్టర్

కేటీఆర్‌.. సమస్య ఉంటే చాలు వెంటనే స్పందిస్తారు. ఎవరికైనా కష్టంతో ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. రీట్వీట్‌తో సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ఎవరైనా ఆకతాయిలు ట్వీట్లు చేస్తే వెంటనే కౌంటర్ ట్వీట్ ఇస్తారు

సోషల్ మీడియా.. ఇప్పుడు నడిపించేదంతా అదే. ఏం జరిగినా.. తెలిసేదంతా ఆ వేదికపైనే.  ఈ కాలంలో చాలామంది జనాల సమస్యలకు పరిష్కారం అక్కడే దొరుకుతుంది. జనాలకు.. నేతలకు మధ్య సోషల్ మీడియా వారధి ఇప్పుడు. అలా కేటీఆర్ దగ్గరకు ఏవైనా ప్రజా సమస్యలపై ట్వీట్‌ వస్తే వెంటనే స్పందిస్తారు. అర్ధరాత్రైనా.. సరే... అధికారులను పరుగులు పెట్టిస్తారు. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారు. కేటీఆర్‌కు ఎవరైనా ట్వీట్ చేస్తే.. ఎలా స్పందించారో కొన్ని చూద్దాం..

జ‌న‌గామ జిల్లా లింగాల గణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన కత్తుల సువర్ణ అనే మహిళా రైతు కొద్ది నెలల క్రితం మరణించింది‌. ఆమె పేరిట 4 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. రైతుబంధు పథకం పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా రూ.5 లక్షల రైతు భీమా పరిహారం కోసం మహిళా రైతు కుటుంబం దరఖాస్తు చేసుకుంది. వివిధ సాంకేతిక కారణాలు చూపి అధికారులు బీమా దరఖాస్తును తిరస్కరించారు. మృతురాలి కుమారుడు కత్తుల కౌశిక్ తమ సమస్యను మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ మెసేజ్ ద్వారా విన్న‌వించాడు. అర్ధరాత్రి జనగామ జిల్లా కలెక్టర్‌కు కేటీఆర్ మెసేజ్ చేసి.. సమస్యను పరిష్కరమయ్యేలా చేశారు.

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం చాకలిగూడెంకు చెందిన సతీశ్​.. 8 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలుండగా.. వారిని పోషించుకోలేని ఆ తల్లి దీనస్థితిని స్థానికులు ట్విట్టర్​లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ట్వీట్​పై స్పందించిన మంత్రి.. వారికి సాయం చేయాల్సిందిగా కోరుతూ స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్​ను ట్యాగ్​ చేశారు. మంత్రి సూచనల మేరకు.. ఎమ్మెల్యే ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇవే కాదు.. అనేక సమస్యలపైనా కేటీఆర్ వెంటనే స్పందించారు.

కౌంటర్ ట్వీట్లు ఉంటాయి...

కొంతమంది ఆకతాయిలు చేసే ట్వీట్లకు కేటీఆర్ కౌంటర్ ట్వీట్ కూడా ఇస్తారు. ఇటీవలే ఓ వ్యక్తి.. బిర్యాని ఆర్డర్ చేస్తే.. మసాలా, లెగ్‌పీస్ రాలేదంటూ.. కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ.. ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి.. అసలు నన్నేందుకు ట్యాగ్ చేశావ్ బ్రదర్? నా నుంచి ఏం ఆశిస్తున్నావంటూ.. స్పందించారు. ఈ మాటలతో ఆ యువకుడు తన ట్వీట్‌ను డిలిట్ చేసేశాడు. ఇలా చాలా ట్వీట్లే ఉన్నాయి.

అంతేకాదు.. ఆస్క్ కేటీఆర్ పేరుతో సోషల్ మీడియాలో అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు కేటీఆర్. Ask me#తో ట్విట్టర్‌లో కేటీఆర్ నిర్వహించే కార్యక్రమంలో చాలామంది పాల్గొని ప్రశ్నలు అడుగుతారు. ఓపికతో వాటికి కేటీఆర్ సమాధానాలిస్తారు. సమస్య పరిష్కారంపై అధికారులతోనూ మాట్లాడతారు.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..ఫేసియల్ రికగ్నిషన్ ఎంట్రీ, ముగ్గురు మంత్రులకు బాధ్యతలు
గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..ఫేసియల్ రికగ్నిషన్ ఎంట్రీ, ముగ్గురు మంత్రులకు బాధ్యతలు
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Adilabad Crime News: మంత్రాలకు డబ్బులు రెట్టింపు అంటూ మోసాలు.. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
మంత్రాలకు డబ్బులు రెట్టింపు అంటూ మోసాలు.. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
Godavarikhani Murder: గోదావరిఖనిలో దారుణం.. ఫోన్ చేసి బయటకు పిలిచి సింగరేణి ఉద్యోగి హత్య!
గోదావరిఖనిలో దారుణం.. ఫోన్ చేసి బయటకు పిలిచి సింగరేణి ఉద్యోగి హత్య!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
Adilabad Crime News: మంత్రాలకు డబ్బులు రెట్టింపు అంటూ మోసాలు.. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
మంత్రాలకు డబ్బులు రెట్టింపు అంటూ మోసాలు.. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
రూ.62,000 వరకు తక్కువకే Honda క్రూయిజర్ బైక్.. Rebel 500 ధర, ఇంజిన్, ఫీచర్లు, కలర్స్ వివరాలు
లో-స్లంగ్ క్రూయిజర్ Honda Rebel 500.. యూత్‌ తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
Kiran Abbavaram Record : కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
IND VS NZ 1st Test Result: తొలిటెస్టులో ఇండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన కివీస్ బ్యాటర్లు.. మారథాన్ ఇన్సింగ్స్ తో  డారిల్ , ఫిలిప్స్ అద్భుత పోరాటం
తొలిటెస్టులో ఇండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన కివీస్ బ్యాటర్లు.. మారథాన్ ఇన్సింగ్స్ తో  డారిల్ , ఫిలిప్స్ అద్భుత పోరాటం, డ్రాగా ముగిసిన మ్యాచ్
Embed widget