అన్వేషించండి

KTR Reaction: మళ్లీ పిలుస్తామన్నారు - లీకులకు బాధ్యులెవరు - సిట్ విచారణ తర్వాత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR : ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులకు కారకులెవరని కేటీఆర్ ప్రశ్నించారు. సిట్ విచారణకు మళ్లీ పిలుస్తామని చెప్పారన్నారు.

KTR questions leaks in the phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సుమారు ఏడు గంటల పాటు జరిగిన ఈ విచారణలో తాను అధికారులకు పూర్తిగా సహకరించానని వెల్లడించారు. అయితే, ఈ మొత్తం వ్యవహారం కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు  కాలక్షేప కథాచిత్రం నడుపుతోందని ఆయన ఎద్దేవా చేశారు. తమ  పై బురద జల్లడమే లక్ష్యంగా ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో , కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరుగుతున్న హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్ సూటిగా స్పందించారు.  కొంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి వారిని బెదిరించినట్లు బయట విపరీతంగా ప్రచారం జరుగుతోంది.. ఇది వాస్తవమా కాదా అని నేను సిట్ అధికారులనే నేరుగా అడిగాను. దానికి వారు అలాంటిదేమీ లేదని, అది వాస్తవం కాదని స్పష్టం చేశారు అని కేటీఆర్ వెల్లడించారు. కేవలం తమ వ్యక్తిత్వ హననానికి  పాల్పడటానికే ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రభుత్వం లీకుల రూపంలో వదులుతోందని ఆయన ధ్వజమెత్తారు.  తాను సిట్ అధికారులను బెదిరించినట్లుగా ప్రచారం చేశారని..కాంగ్రెస్ వాళ్లుక ఎలా తెలిసిందని ప్రశ్నించారు. 

విచారణ సమయంలో జరుగుతున్న లీకులపై  అధికారులను గట్టిగా నిలదీశానని కేటీఆర్ తెలిపారు.  విచారణ గదిలో ఉన్న అంశాలు బయటకు ఎలా వస్తున్నాయని, ఒకవేళ తానే లీకులు ఇచ్చానని అనుకుంటే.. తన ఎదురుగా ఉన్న అధికారుల ఫోన్లను కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. గతంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎలా ఉండేవో, ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాధాకిషన్ రావుతో తనను ముఖాముఖి కూర్చోబెట్టలేదని స్పష్టం చేశారు. విచారణలో తనతో పాటు ఏ రావు లేరన్నారు.   

చివరగా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపబోమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక, రైతుల సమస్యలను పరిష్కరించలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి కేసులతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. ఈ లీకులను, తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు ,  ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము చట్టానికి కట్టుబడి ఉంటామని, న్యాయస్థానాల్లోనే అన్ని విషయాలు తేలుతాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.                 

 

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget