అన్వేషించండి

Komatireddy Meets Revant : గాంధీ భవన్‌లో రేవంత్‌తో కోమటిరెడ్డి భేటీ - టీ కాంగ్రెస్‌లో సంక్షోభం ముగిసినట్లేనా ?

గాంధీ భవన్‌లో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి సమావేశం అయ్యారు. గాంధీ భవన్ మెట్లెక్కనన్న ఆయన ఒక్క సారిగా రూటు మార్చుకోవడంతో ఇక కాంగ్రెస్‌లో సంక్షోభం సమసిపోయినట్లేనని భావిస్తున్నారు.

Komatireddy Meets Revant :   తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అసంతృప్త నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్‌కు వచ్చారు. నేరుగా రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత ఆయన తాను ఇక గాంధీ భవన్ మెట్లెక్కనని సవాల్ చేశారు. అ ప్రకారం అప్పటి నుండి గాంధీ  భవన్ కు రావడం లేదు. కానీ ఇప్పుడు మాత్రం అనూహ్యంగా గాంధీ  భవన్ కు రావడమే కాదు..నేరుగా రేవంత్ రెడ్డితో సమావేశం జరిపారు. తమ మధ్య విభేదాలేమీ లేవన్నట్లుగా ఆయన వ్యవహరించడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. 

గాంధీ భవన్‌కు రానని ఎప్పుడూ చెప్పలేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

గాంధీ భవన్ మెట్లెక్కనని తాను ఎప్పుడూ అనలేదని రేవంత్ రెడ్డి కవర్ చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ గా మాణిక్ రావు ధాక్రే నియమితులైన తర్వాత  తొలి సారి హైదరాబాద్ వచ్చి రెండు రోజుల పాటు సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఆహ్వానించారు. కానీ ఆయన తాను గాంధీ భవన్ కు రానని..బయట కలుస్తానని సమాచారం ఇచ్చారు.దానికి తగ్గట్లుగా తర్వాతి రోజు.. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాణిక్ రావు ధాక్రేతో సమావేశం అయ్యారు. కానీ రెండో సారి మాణిక్ రావు థాక్రే.. తెలంగాణ పర్యటనకు వచ్చే సరికి ఆయన గాంధీ భవన్ లో ప్రత్యక్షమయ్యారు. 

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చానన్న కోమటిరెడ్డి 

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తాను గాంధీ భవన్‌కు వచ్చానని కోమటిరెడ్డి చెప్పుకున్నారు. నిజానికి ఇటీవల నియమించిన ఏ కాంగ్రెస్ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కలేదు. కానీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చానని చెప్పుకున్నారు. మాణిక్ రావు థాక్రేనే తనను రావాలని ఫోన్ చేశారని కోమటిరెడ్డి చెబుతున్నారు. కోమటిరెడ్డి వ్యవహారాశైలి   కాంగ్రెస్ నేతలతో పాటు ఆయన అనుచరుల్లోనూ పజిల్ గా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారా లేకపోతే కొత్త వ్యూహం ఏదైనా అమలు చేస్తున్నారా అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. పైగా తాను కాంగ్రెస్ పార్టీకి దూరంగా లేనని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పుకొచ్చారు.  కానీ ఇటీవల తిరుమల పర్యటనలో తాను  రాజకీయాలకు దూరంగా ఉన్నానని... ఎన్నికలకు రెండు నెలల ముందు ఏ పార్టీలో చేరుతానో చెబుతానని ప్రకటించారు. 

కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి సర్దుకుపోవాలని నిర్ణయించుకున్నారా ? 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇటీవలి కాలంలో తీవ్రమైన ప్రకటనలు చేశారు. అందుకే రెండు సార్లు హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ మాటలు తాను అనలేదని మార్ఫింగ్ అని చెప్పుకొచ్చారు. ఇటీవల సీనియర్లు రేవంత్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే.. వారికి మద్దతు పలికారు. ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అయినప్పటికీ ఆయన మళ్లీ గాంధీ  భవన్‌కు రావడంతో... తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ నుంచి ఆయనకు భరోసా లభించి ఉంటుందన్న అభిప్రాయం .. తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Prakash Goud Son Santosh Goud Allegations: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Embed widget