By: ABP Desam | Updated at : 03 May 2022 01:34 PM (IST)
హరీశ్ రావు
Harish Rao in Siddipet: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అతి త్వరలోనే మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ ప్రైవేటు ఆస్పత్రులు మినహా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైందని గుర్తు చేశారు. మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జిల్లా హాస్పిటల్స్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న రోగులను మంత్రి హరీశ్ రావు సోమవారం (మే 3) పరామర్శించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు అక్కడ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కన్న కలలు నేడు నిజమవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట ఆస్పత్రిలో మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు చేస్తామని అన్నారు. పేదవారు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని మంత్రి సూచించారు. డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే చేసుకునే మోకాలి చిప్పల మార్పిడి తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఆస్పత్రుల్లోనూ పేద వాళ్లకు కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చిందని చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటళ్లలో 30 శాతం ప్రసవాలు అయితే ఇప్పుడు 56 శాతం అవుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్లనే ఆస్పత్రిలో ఎక్కువగా సర్జరీలు అవుతున్నాయని హరీశ్ రావు తెలిపారు.
వేముల వాడలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన
వేములవాడ రాజన్నను మంగళవారం మంత్రి కొప్పుల దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ రాజన్న కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని అన్నారు. స్వామి వారి దర్శనానికి వస్తున్న భక్తుల ఇబ్బందులను ముఖ్యమంత్రి స్వయంగా చూశారని అన్నారు. అందుకే సీఎం ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి పనులు ప్రారంభించారని అన్నారు.
అందుకోసం ముడి చెరువులో 35 ఎకరాలు ఇప్పటికే సేకరణ పూర్తయిందని మంత్రి తెలిపారు. బద్ది పోచమ్మ ఆలయం విస్తరణకు సైతం భూసేకరణ కూడా పూర్తి చేశారని అన్నారు. యాదాద్రి ఆలయంలాగానే సీఎం కేసీఆర్ వేములవాడ, కొండగట్టు ధర్మపురి, జోగులాంబ, భద్రాద్రి ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తారని చేస్తారని మంత్రి తెలిపారు.
సిద్దిపేట ఈద్గ వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీ హరీష్ రావు గారు.
— Harish Rao News (@TrsHarishNews) May 3, 2022
ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ముస్లిం సోదరులతో అలాయ్ బలాయ్ తీసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. pic.twitter.com/rH6A3OsA6J
KTR On Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ రెండు పార్టీల సమస్య - లోకేష్ ఫోన్ చేస్తే కేటీఆర్ ఏం చెప్పారంటే ?
MLC What Next : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కేసీఆర్ కొత్త పేర్లు ప్రతిపాదిస్తారా ? మళ్లీ వారి పేర్లే పంపుతారా ?
Telangana High Court: ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు హైకోర్టు షాక్- రూ.10 వేల జరిమానా, ఎందుకంటే!
NIMS: 'నిమ్స్'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
Nalgonda News: అర్ధరాత్రి అంత్యక్రియలు, హత్య చేశారనే అనుమానంతో గొయ్యి తవ్వి చూస్తే షాక్
Vizag Capital : విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?
Pedda Kapu Movie : 'అఖండ 2' ఉంటుంది, ప్రభాస్‌తో విరాట్ కర్ణను కంపేర్ చేయడం హ్యాపీ - 'పెద కాపు' నిర్మాత రవీందర్ రెడ్డి ఇంటర్వ్యూ
Kavitha Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు భారీ ఊరట - సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఏమిటంటే ?
Salaar Vs Dunki : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
/body>