అన్వేషించండి

KCR Key Comments : 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు - బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు

Telangana News : 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కవిత అరెస్టుపైనా స్పందించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

KCR said that 20 Congress MLAs are in touch with him :  తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రతినిధులతో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై కీలక వ్యాఖ్యలు చేశారు.  తనతో ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అసవరం లేదన్నారు. అయితే మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టుకుండా ఉంటారా అని ప్రశ్నించారు.  20 మంది ఎమ్మెల్యేల‌ను తీసుకొని రావాలా సార్ అని ఓ సీనియ‌ర్ కీల‌క నేత‌ త‌న‌ను సంప్ర‌దించాడు. ఇప్పుడే వ‌ద్ద‌ని వారించాన‌ని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్‌లో టీమ్ వ‌ర్క్ లేదు.. స్థిర‌త్వం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు 8 లోక్‌స‌భ సీట్ల‌లో గెలుస్తామ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. మ‌రో మూడు స్థానాల్లో విజ‌యావ‌కాశాలు ఉన్నాయని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

బీఆర్ఎస్ కు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారన్నారు. తాము దొరకబట్టుకున్నామని అందుకే మోదీ కక్ష కట్టారని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు పోలీసుల్ని పంపామని .. అందుకే అమిత్ షా, మోదీ కక్ష కట్టి.. కవితను అరెస్టు చేయించారన్నారు. లిక్కర్ కేసు ఉత్తదేనని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడుతుందని జోస్యం చెప్పారు. భవిష్యత్ మనదేనని పార్టీ నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 
 
లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో రాజ‌కీయం గంద‌ర‌గోళం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు. ఏ రాజ‌కీయ గంద‌ర‌గోళం జ‌రిగినా బీఆర్ఎస్‌కే మేలు జ‌రుగుతుంది. ఉద్య‌మ‌కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తారు. బ‌స్సు యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖ‌రార‌వుతుంది. కాంగ్రెస్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ప్రారంభ‌మైంది.. రానున్న రోజులు మ‌న‌వే. పార్ల‌మెంట్‌లో మ‌న గ‌ళం వినిపించాల్సిన అవ‌స‌రం ఉంది. కొంద‌రు నేత‌లు పార్టీని వీడి వెళ్లినంత మాత్రానా బీఆర్ఎస్‌కు న‌ష్టం ఏమీ లేదు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రైతు స‌మ‌స్య‌లు అజెండాగా ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లాలి. రైతు స‌మ‌స్య‌ల‌పై పోస్టుకార్డు ఉద్య‌మం ఉధృతం చేయాలి. ఒక్కో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ల‌క్ష పోస్టుకార్డులు రాయాలి. రైతుల క‌ల్లాల కాడికి వెళ్లి రూ. 500 బోన‌స్‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాలి. ప్ర‌భుత్వ హామీల‌ను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలి. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉంది. దాన్ని అనుకూలంగా మ‌లుచుకోవాలి అని కేసీఆర్ సూచించారు.

బ‌స్సు యాత్రం చేద్దాం.. జ‌నం నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని కేసీఆర్ తెలిపారు. ఈ నెల 22 నుంచి రోడ్డు షోలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రెండు, మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్‌షోలు ఉంటాయ‌న్నారు. రోజుకు రెండు, మూడు రోడ్‌షోలు ఉంటాయ‌న్నారు. ఉద‌యం స‌మ‌యంలో రైతుల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. సాయంత్రం వేళ రోడ్డు షోలు, కార్న‌ర్ మీటింగ్స్ నిర్వ‌హించ‌నున్నారు. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ సెంట‌ర్ల‌లో భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Gachibowli DLF Road Closed 90 Days: మూడు నెలల పాటు గచ్చిబౌలి రోడ్ మూసివేత - పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవిగో
మూడు నెలల పాటు గచ్చిబౌలి రోడ్ మూసివేత - పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవిగో
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget