అన్వేషించండి

NO Bail For Kavitha : తప్పిన కేటీఆర్ అంచనాలు - కవితకు బెయిల్ లేనట్లే - సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇవిగో

Kalvakantla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించలేదు. సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది.

Kavitha was not granted bail in the Supreme Court: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందన్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అంచనాలు తలకిందులు అయ్యాయి. సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ కేసులో సీబీఐ, ఈడీ వాదనలు విన్న తర్వాతనే తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి నెలలో హైదరాబాద్ కు వచ్చి విచారణ చేపట్టిన అనంతరం ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసి, ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచి ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉంటున్న ఎమ్మెల్సీ క‌విత‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చేందుకు జ‌స్టిస్ గ‌వాయి, జ‌స్టిస్ విశ్వ‌నాథ‌న్ లతో కూడిన సుప్రీం ధ‌ర్మాస‌నం సోమవారం నాడు నిరాక‌రించింది.  

కవిత తరపున ముకుల్ రోహత్గీ వాదనలు               

సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ  ఎమ్మెల్సీ క‌విత త‌ర‌పున వాద‌న‌లు వినిపించారు. మార్చి నుంచి గత 5 నెల‌లుగా క‌విత జైల్లో ఉన్నారు. మ‌హిళ అయి, అందులోనూ ప్రజా ప్రతినిధి అయిన క‌విత‌ను ఇంకెంత కాలం జైల్లో ఉంచుతారని దర్యాప్తు సంస్థల తీరును ముకులు రోహత్గీ ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్ప‌టికే ఆప్ నేతలు, ఢిల్లీ మాజీ మంత్రి మ‌నీష్ సిసోడియా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పొందారని, బెయిల్ మంజూరు కావడానికి కవిత కూడా అర్హులరాలేనని రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐల‌కు నోటీసులు జారీ చేసి, వారి అభిప్రాయాన్ని తీసుకుంటామని జ‌స్టిస్ గ‌వాయి చెప్పారు.   

దర్యాప్తు సంస్థల వాదనలు విన్న తర్వాతే మధ్యంతర బెయిల్‌పై నిర్ణయం   

కవితకు బెయిల్ కోసం కేటీఆర్, హరీష్ రావు ఇటీవల ఢిల్లీలో మకాం వేశారు. బెయిల్ కోసం సీనియర్ లాయర్లను, న్యాయ నిపుణులను సంప్రదించి పకడ్బందీగా వ్యవహరించారు. ఈ క్రమంలో కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రాగా, ఆమెకు  మ‌ధ్యంత‌ర బెయిల్ అయినా ఇవ్వాలని ముకుల్ రోహ‌త్గీ సుప్రీం ధ‌ర్మాస‌నానికి విజ్ఞ‌ప్తి చేశారు. కానీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు జ‌స్టిస్ గవాయి నిరాక‌రించారు. ఈ విషయంలో ముందుగా కవితను విచారించిన దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ అభిప్రాయాల‌ను తీసుకున్న త‌ర్వాతే వాద‌న‌లు వింటామ‌న్నారు. మ‌ధ్యంత‌ర బెయిల్ సైతం ఇప్పుడు ఇవ్వ‌లేమ‌న్నారు. సుప్రీం ధర్మాసనం ఆగ‌స్టు 20వ తేదీకి కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసింది. నిర్ణీత గడువులోగా ఈడీ, సీబీఐలు అఫిడ‌విట్ దాఖలు చేయాల‌ని ఆదేశించారు.

ఈ వారంలో  బెయిల్ వస్తుందనుకున్న కేటీఆర్      

కవితకు కచ్చితంగా బెయిల్ వస్తుందని కేటీఆర్ భావించారు. ఆమె ఆరోగ్యం బాగోలేదని మెడికల్ గ్రౌండ్స్ మీద సోదరి కవితకు బెయిల్ మంజూరు చేస్తారని బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆశగా ఎదురుచూశారు. దర్యాప్తు సంస్థల వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వడం కష్టమని ధర్మాసనం పేర్కొంది. మధ్యంతర బెయిల్ సైతం ఇచ్చేదిలేదని, దర్యాప్తు సంస్థల అభిప్రాయాన్ని కోరుతూ నోటీసులు జారీ చేసింది. మరో పదిరోజుల పాటు కవిత జైల్లో ఉండనున్నారు. ఒకవేళ ఈడీ, సీబీఐలు అనుకూల అభిప్రాయాన్ని చెబితేనే కవితకు బెయిల్ లభించే అవకాశం ఉంది. 

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇటీవల బెయిల్ లభించింది. పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్న ఆప్ కీలక నేత బెయిల్ పై విడుదలయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. కానీ సీబీఐ కేసులో ఇంకా ఊరట లభించలేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్లుగా మారిన వారంతా ఒక్కొక్కరుగా బెయిల్ పొందారు. నెక్ట్స్ కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.                         

టాప్ హెడ్ లైన్స్

ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget