అన్వేషించండి

Kavitha new party: శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన - తెలంగాణ ప్రజాజాగృతి ఆవిష్కరణకు ముహుర్తం ఖరారు

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీని శ్రీరామనవమి రోజున ప్రకటించనున్నారు.

Kavitha sets the time for her new party: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 8 గంటలకు ఆమె తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు. గత కొంతకాలంగా తెరవెనుక కసరత్తు పూర్తి చేసిన కవిత.. ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
 
కవిత  పార్టీ పేరు, జెండా, గుర్తు , పార్టీ విధివిధానాలను శ్రీరామనవమి రోజున వెల్లడించనున్నారు.   తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో  తెలంగాణ జాగృతి ద్వారా విశేష గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు అదే స్ఫూర్తితో రాజకీయ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. పార్టీ ఎజెండాలో ప్రధానంగా మహిళా సాధికారత, తెలంగాణ ఆత్మగౌరవం,  నిరుద్యోగ సమస్యల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కీలక సమావేశంలో కేవలం పార్టీ ప్రకటన మాత్రమే కాకుండా, తాను రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారో కూడా కవిత స్పష్టం చేయనున్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె, ఈసారి అసెంబ్లీ బరిలో నిలుస్తారా లేక మళ్లీ పార్లమెంట్‌కే వెళ్తారా అన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.  
 
బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేయడంతో కొత్త పార్టీ పెడుతున్నారు.  హరీష్ రావు, సంతోష్ కుమార్ వంటి వారు పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తన తండ్రి కేసీఆర్ చుట్టూ చేరి ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను జైలుకు వెళ్లినప్పుడు కూడా పార్టీ నుంచి గానీ, తన సోదరుడు కేటీఆర్ నుంచి గానీ ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే కొందరు పెద్దపీట వేస్తుండటం, సీనియర్ కార్యకర్తలను విస్మరిస్తుండటం వల్ల తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ఆమె ప్రకటించారు. 

బిఆర్ఎస్ పార్టీ తన మౌలిక సిద్ధాంతాలైన నీళ్లు, నిధులు, నియామకాలు అనే లక్ష్యాల నుంచి పక్కకు జరిగిందని కవిత విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి టిఆర్ఎస్ (TRS)ను బిఆర్ఎస్ (BRS)గా మార్చడాన్ని ఆమె ఆది నుంచి వ్యతిరేకించారు. కాంట్రాక్ట్ పద్ధతి, ధర్నా చౌక్ ఎత్తివేత, రైతుల అరెస్టుల వంటి ప్రభుత్వ నిర్ణయాలను తాను పార్టీలో ఉండి ప్రశ్నించినందుకు తనను కావాలనే పక్కన పెట్టారని ఆమె వెల్లడించారు. బిసి రిజర్వేషన్లు, నిరుద్యోగ సమస్యలపై తాను చేస్తున్న పోరాటాన్ని 'పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు'గా ముద్ర వేసి తనను సస్పెండ్ చేయడం ద్వారా చర్చలకు తావు లేకుండా చేశారని, అందుకే ప్రజల గొంతుకగా మారడానికి కొత్త పార్టీని స్థాపించడమే ఏకైక మార్గమని ఆమె నిర్ణయించుకున్నారు.                         


 

టాప్ హెడ్ లైన్స్

Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget