అన్వేషించండి

Karimnagar: రోడ్డు ప్రమాదాల్లో కనిపించని కనీస మానవత్వం, పెరుగుతున్న హిట్ అండ్ రన్ కేసులు

ఇలాంటి ప్రమాదాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రమాదానికి కారణమైన వారు మాత్రం అక్కడి నుండి తప్పించుకునే క్రమంలో ఎవరి ప్రాణాలు పోయినా చాలా మంది పట్టించుకోవడం లేదు.

Karimnagar Accidents: ఈ చిత్రంలో కనిపిస్తున్న యువకుడు పేరు అనుపురం దీపక్. అందరూ ముద్దుగా బన్నీ అని పిలుచుకునే ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు. తండ్రి కులవృత్తి అయిన కల్లు గీసే పనిలో ఉంటూ తాటిచెట్టుపై నుండి పడి కొంత కాలం కిందటే గాయాలపాలయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతల్లో పాలుపంచుకున్నాడు దీపక్. ఈ మధ్య ఓ ప్రైవేటు సంస్థలో కరీంనగర్ పట్టణంలో ఉద్యోగంలో చేరిన దీపక్ తన సొంత ఊరిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి డ్యూటీలో చేరడానికి కరీంనగర్ కి సోమవారం ఉదయం వెళ్తున్నాడు. కరీంనగర్ - జగిత్యాల హైవేపై వెళుతున్న క్రమంలో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాలైన దీపక్ అక్కడే పడిపోయాడు. కనీసం లేవలేని పరిస్థితిలో అచేతనంగా ఉండిపోయాడు. 

అయితే సదరు ఢీకొట్టిన వ్యక్తి తన వాహనాన్ని ఏ మాత్రం ఆపకుండా అక్కడి నుండి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో చాలా సమయం పాటు స్పృహలోకి రాలేని దీపక్ తన ప్రాణాలు విడిచాడు. ఎన్నో కలలతో భవిష్యత్తు చూడాలనుకున్న ఒక్కగానొక్క కుమారుడు అర్థాంతరంగా విగతజీవిగా పడి ఉండడంతో అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. సున్నిత మనస్కుడిగా అందరితో కలుపుగోలుగా ఉండే దీపక్ మరణం పట్ల బంధుమిత్రులు తీవ్రంగా రోధించారు. విషయం తెలిసిన వెంటనే అతని స్నేహితులు కరీంనగర్ ప్రధానాస్పత్రికి చేరుకొని స్నేహితుడిని రోదించడం పలువురిని కలిచివేసింది.

ఎందుకిలా? చట్టం ఏం చెప్తోంది?
నిజానికి ఇలాంటి ప్రమాదాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రమాదానికి కారణమైన వారు మాత్రం అక్కడి నుండి తప్పించుకునే క్రమంలో ఎవరి ప్రాణాలు పోయినా పట్టించుకునేలా లేరు... చట్టానికి తాము దొరక్కుండా ఉంటే చాలు అనే భావనతో ఢీకొట్టిన వెంటనే అక్కడి నుండి పారిపోతున్నారు కానీ బాధితుల కుటుంబాలకు.. ఎంతో మంది స్నేహితులకు తీవ్రమైన వేదన మిగిల్చుతున్నామని ఆలోచన కూడా వారిలో ఉండడం లేదు. ఎవరు ఎటు పోతే నాకేంటి అని నిర్లక్ష్యమే వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. 

ప్రమాదవశాత్తు ఢీకొట్టినా కనీసం గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా హిట్ అండ్ రన్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు తీసే దుర్మార్గులను శిక్షించడానికి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. సరైన సాక్షాధారాలు లభించిన వెంటనే పోలీసులు ఆయా సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి సకాలంలో నిందితులను పట్టుకుంటే ఎంతటివారైనా సరే ఈ చట్టాల నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. చట్టానికి భయపడే ముందు.. కనీసం మానవత్వంతో ఆలోచిస్తే ఆక్సిడెంట్ కి తామే కారణమైనా ఒక విలువైన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేసినవారవుతారు.

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget