అన్వేషించండి

Gangula Kamalakar: బండి సంజయ్, రాజాసింగ్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు - మంత్రి గంగుల 

Gangula Kamalakar: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాజా సింగ్ అహంకార పూరితంగా, అసంబద్ధంగా మాట్లాడారని మండిపడ్డారు.

Gangula Kamalakar: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాజా సింగ్ అహంకార పూరితంగా, అసంబద్ధంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇతరులను గెలిపించాలని బండి సంజయ్‌కు హెలికాప్టర్ ఇస్తే.. ఈయనను గెలిపించేందుకు మరో నాయకుడు వచ్చాడని ఎద్దేవా చేశారు. బీజేపీలో బండి సంజయ్, రాజా సింగ్ దొందూ దొందేనని గంగుల విమర్శించారు.

రేవంత్ రెడ్డిని బండి సంజయ్ బలి కా బకరా అంటూ వ్యాఖ్యానించడంపై మంత్రి గంగుల స్పందిస్తూ.. నిజానికి బండి సంజయ్, రాజా సింగ్‌లు బలి కా బకరాలు అని విమర్శించారు. బండి సంజయ్‌కు పోటీ చేయడం ఇష్టం లేకపోయినా టికెట్ ఇచ్చి బలి కా బకరా చేశారని ఎద్దేవా చేశారు. నిషేధిత అభ్యర్థి రాజాసింగ్ అని, అర్ధరాత్రి వెళ్లి కాళ్లు పట్టుకుంటే తిరిగి పార్టీలోకి తీసుకున్నారని ఆరోపించారు. బండి సంజయ్‌కు మూడోసారి మూడో స్థానమేనని అన్నారు.

రాజాసింగ్ రాకతో బండి సంజయ్ గ్రాఫ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడని గంగుల అన్నారు. ఇవాళ కరీంనగర్‌లో రాజా సింగ్ నడిచారని, అలాంటి రోడ్డు ఒక్కటైనా గోషామహల్లో ఉందా? అంటూ ప్రశ్నించారు. తాము చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగుతున్నామని అన్నారు. బండి సంజయ్ ఎప్పటి మాటలో ఇప్పుడు చెబుతుంటే అందరూ నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. 

మొదటి రోజు తనకు బీ ఫారం ఇవ్వలేదని అడుగుతున్న బండి సంజయ్, మొదటి రోజు ఎందుకు నామినేషన్ వేయలేదని మంత్రి ప్రశ్నించారు. రాజాసింగ్‌కు దమ్ముంటే ఇప్పుడు గెలవాలని, ఆయన సమర్థుడుతే ఆయన్ను బీజేపీ ఎందుకు పక్కన పెట్టిందని నిలదీశారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో బండి సంజయ్, రాజా సింగ్ ఘోరంగా ఓడిపోతున్నారని అన్నారు. ఎంపీగా సంజయ్ పని చేయలేదని, కాబట్టే ప్రజలు ఆయన్ను ఓడించబోతున్నారని చెప్పుకొచ్చారు. 

ప్రశాంతంగా ఉన్న కరీంనగర్‌ను స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవద్దని మంత్రి హితవు పలికారు. ఓట్లు అడిగే పద్ధతి ఇది కాదని, ఏం పని చేశారో చెప్పి ఓట్లు అడగాలని సూచించారు. ప్రజలను రెచ్చగొట్టి కాదని, పనులు చేసి ఓట్లు అడగాలని అన్నారు. గోషామహల్‌లో  రాజా సింగ్ చేసిన అభివృద్ధి శూన్యమని, బీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న సంజయ్‌ను తీస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్టు కింద రేషన్ కార్డులు కేంద్రమే ఇవ్వాలనన్నారు. 

తెలంగాణ వచ్చినప్పుడు 90 లక్షల రేషన్ కార్డులుంటే అందులో 54 లక్షల కార్డులకే కేంద్రం అంగీకారం తెలిపిందని, మిగతావి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కేంద్రం ఒక్క కొత్త కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. 35.67  లక్షల కార్డులకు ఖర్చు భరించి బియ్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కేంద్రం ఇవ్వకపోయినా తాము కొత్తకార్డులు మంజూరు చేస్తూనే ఉన్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరు లక్షల పైచిలుకు కొత్త కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు.

బండి సంజయ్ నామినేషన్‌కు 500 మంది కూడా రాలేదని, ప్రజలకు బీజేపీపై నమ్మకం లేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ తమ తప్పులు ఒప్పుకొని, ఇకపై చేస్తామని చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.  కరీంనగర్‌లో 2014, 2018లో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీ ఓడిపోతుందని, ప్రజలు విధ్వంసాన్ని కోరుకోవడం లేదన్నారు. ఇన్నాళ్లు బండి సంజయ్ పెద్ద నాయకుడు అనుకున్నానని, రాజాసింగ్‌ను తెచ్చుకున్నప్పుడే చోటా లీడర్ అని అర్థమైందన్నారు. 

ఎంఐఎంకు మేయర్ పదవి ఇస్తారని 2018 లోనూ ప్రచారం చేశారని మంత్రి గంగుల బీజేపీపై ఫైర్ అయ్యారు. ఈసారి కూడా అలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు.  తమ పార్టీకి అభ్యర్థులు కరువని ఎంఐఎంకు సీట్లిస్తామా? అంటూ ప్రశ్నించారు. 

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Embed widget