అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Karimnagar: కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం - పేలిన 5 గ్యాస్ సిలిండర్లు
Fire incident Karimnagar: కరీంనగర్ లో 5 గ్యాస్ సిలిండర్లు పేలడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కి పడ్డారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
![Karimnagar: కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం - పేలిన 5 గ్యాస్ సిలిండర్లు fire accident in Karimnagar Telangana Karimnagar: కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం - పేలిన 5 గ్యాస్ సిలిండర్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/20/bedcfe7c55ec5a7a716e6047261b8f6c1708413228922234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కరీంనగర్ లో అగ్ని ప్రమాదం
Fire Accident in Karimnagar: కరీంనగర్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని జగిత్యాల రోడ్ లో స్థానిక సుభాష్ నగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఏకంగా ఈ ఘటనలో 5 గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలు పూరి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. తొలుత ఈ ప్రాంతంలో మంగళవారం (ఫిబ్రవరి 20) ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలకు గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయి. దాంతో మంటలు మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. మంటలు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుండటంతో స్థానికులు భయానికి గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పూరిళ్లలోని కార్మిక కుటుంబాలు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి గల మూలాల గురించి అగ్ని మాపక సిబ్బంది పరిశీలిస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)