అన్వేషించండి

నిర్మల్‌లో బండి సంజయ్‌ మాస్ వార్నింగ్- కవిత కోసం ధర్నాలు ఎందుకు చేయాలని నిలదీత

అవినీతి అనకొండ కేసీఆర్ కుటుంబంతోపాటు అవినీతి తిమింగల అల్లకల్లోల మంత్రిని సైతం వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఊచలు లెక్క పెట్టిస్తామని అన్నారు బండి సంజయ్.

కేసీఆర్.... నీ బిడ్డ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? ఝాన్సీ లక్ష్మీబాయినా? ప్రజల సొమ్ముతో లక్ష కోట్ల లిక్కర్ దందా చేశారు. అలాంటి వ్యక్తి కోసం తెలంగాణ ప్రజలెందుకు ధర్నా చేయాలె?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వేలాది ఎకరాలను కబ్జా చేసి వేల కోట్లు దోచుకున్న తిమింగలంలా మారారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో 40 శాతం ఒక వర్గానికే కేటాయిస్తే 80 శాతం జనాభా ఉన్న హిందువుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఊరుకోబోనని, హిందువులను మోసం చేసి దాడులు చేస్తే నిర్మల్‌కు వచ్చి ఒక్కొక్కరిని తరిమితరమి కొడతామని హెచ్చరించారు. 

అవినీతి అనకొండ కేసీఆర్ కుటుంబంతోపాటు అవినీతి తిమింగల అల్లకల్లోల మంత్రిని సైతం వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఊచలు లెక్క పెట్టిస్తామని అన్నారు బండి సంజయ్. నిర్మల్‌లో ప్రభుత్వ భూములనే సాకుతో శాంతి నగర్‌లో పేదల ఇళ్లను కూల్చేసిన అధికారులు... అవే ప్రభుత్వ భూముల్లో బడా బాబుల విల్లాలను ఎందుకు కూల్చివేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిర్మల్‌కు బుల్డోజర్లను పంపి బడాబాబుల ఇళ్లను కూల్చివేయిస్తామని హెచ్చరించారు. లవ్ జిహాదీల పేరుతో హిందూ అమ్మాయిలను వేధించే వారిని జైల్లో పెట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హిందూ అమ్మాయి శ్రద్దావాకర్‌ను 36 ముక్కలు చేయడంతోపాటు 20 మంది అమ్మాయిలను మోసం చేసిన ఆ అప్తాబ్ విషయంలో లౌకిక శక్తుల నోళ్లు ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నించారు. 

రాత్రి నిర్మల్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన బండి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బైంసా(మహిషా) మనదేనని, పచ్చ(ఎంఐఎం) జెండాకు ఎక్కడా ఎగిరే అవకాశమే ఇవ్వం బిడ్డా.. రానున్న రోజుల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో తాను నడుస్తున్నా... నడిపిస్తున్నది మాత్రం పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డినే అని, మీలో జోష్ చూసిన తర్వాత, నిర్మల్ సంగతేందో చూద్దామనిపిస్తుంది అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం చౌరస్తాలో బండి సంజయ్ ప్రసంగించారు. బీజేపీ కార్యకర్తలు దమ్మేంటో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలీదా?, టైం, డేట్, ప్లేస్ చెప్పి మరీ... పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ జరిపి, మనమేంటో చూపించాం అన్నారు. 

ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాల్నా ? వద్దా? 
తెలంగాణ సీఎం కేసీఆర్ బిడ్డ లక్ష కోట్లు పెట్టి, ఢిల్లీలో లిక్కర్ దందా చేసిందని.. కనుక సీఎం కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాల్నా ? వద్దా? అన్నారు. కవితకు నోటీస్ రాగానే... trs కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా టైర్లు కాలబెట్టాలి అంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా తెచ్చిన 317 జీవో కు వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్లిన, కానీ దందాలు చేసి బండి సంజయ్ జైలుకు పోలేదు.. దేశం కోసం, ధర్మం కోసం, నా హిందూ సమాజం కోసమే జైలుకుపోయిన అన్నారు బండి సంజయ్. కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేస్తారంటే మళ్లీ ఉద్యమం చేయాలంట? కేసీఆర్ ను ఎవరూ కాపడలేరు. కేంద్రంలో ఉన్నది అవినీతిపరులను జైళ్లకు పంపే నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నారు.

‘నిజాయితీగా పనిచేసే ఏ ఒక్క వ్యాపారస్తులపైన అయినా సిబిఐ, ఈడి దాడులు జరిగాయా?. అవినీతికి పాల్పడే వాళ్లపై దాడులు చేయాలా... వద్దా?. పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రను అడ్డుకునేందుకు పర్మిషన్ల పేరుతో ఇబ్బంది పెడుతుంటే కోర్టు ద్వారా అనుమతి తీసుకుని పాదయాత్ర చేస్తున్నాం. కోర్టుల ద్వారా అనుమతి తీసుకుని పాదయాత్ర చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ అవుతుందో ప్రజలు ఒకసారి గమనించాలి. గడీల పాలనను అంతం చేయడానికి బిజెపి ముందుకొచ్చింది. నమ్మి రాష్ట్రాన్ని అప్పజెప్పితే, తెలంగాణను దివాళా తీసి, ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడు. నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. 
రైతు రుణమాఫీ చేయడు. రైతుబంధు పేరుతో రైతులకు రావాల్సిన అన్ని సబ్సిడీలను ఎత్తేశాడు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నాడు. విద్యార్థులకు పొమ్మనలేక పొగ పెడుతున్నాడు. స్కావెంజర్లను తీసేసిండు. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులకుప్పగా మార్చిండు. 4వ తారీఖు వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ నెత్తిపైనా లక్ష రూపాయల అప్పు పెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Embed widget