అన్వేషించండి

Bandi Sanjay: జగిత్యాల ఎస్సై సస్పెన్షన్ ఎంఐఎం ఒత్తిడి వల్లే - బండి సంజయ్ పిలుపు, రేపు బంద్‌కు పిలుపు

ఈ ఘటనపై ఎస్సై అనిల్, ఆయన భార్య చేసిన తప్పేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. అనిల్ ను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జగిత్యాల ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేసిన వ్యవహారంలో ఎలాంటి విచారణ చేయకుండానే ఎంఐఎం నేతల ఒత్తిడితో ఈ పని చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ఆదేశాలతో ఎస్సై అనిల్ పై చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు. ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన అని అన్నారు. ఈ ఘటనపై ఎస్సై అనిల్, ఆయన భార్య చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అనిల్ ను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  దాడి చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఓ భర్తగా ఎస్సై తన భార్యను కాపాడుకోవడానికి మాట్లాడితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. వెంటనే ఎస్సై అనిల్ సస్పెన్షన్ ను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఎస్సైని సస్పెండ్ చేస్తే పోలీస్ సంఘాలు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. దీనికి వ్యతిరేకంగా రేపు జగిత్యాల బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నా భర్త ఏ తప్పు చేయలేదు మాకు న్యాయం చేయండి - ఎస్సై భార్య ఆవేదన
కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవ వివాదానికి దారి తీసింది. ఈ వివాదంలో చివరకు ఓ ఎస్సై సస్పెండ్ అవ్వడం, ఆయన భార్యపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. తన భార్యతో గొడవ పడిన మైనార్టీ యువతిపై ఎస్సై దాడికి పాల్పడ్డాడని, ఆమెను జుట్టు పట్టుకుని బస్సు నుంచి కిందకు లాక్కొచ్చినట్లు వార్తలొచ్చాయి. బూటు కాళ్లతో తన్నుతూ అసభ్యకర పదజాలంతో ఎస్సై దూషించినట్లు మైనార్టీ యువతి ఆరోపిస్తుంది. అయితే సస్పెండ్‌కు గురైన ఎస్సై అనిల్ భార్య సంధ్య వాదన మాత్రం మరోలా ఉంది. మైనార్టీ యువతినే తనను నోటికొచ్చినట్లు తిట్టడంతో పాటు కొట్టారని, తన భర్త ఆమెను కొట్టలేదని చెబుతోంది.

'నా బిడ్డకు పాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో సీటు ఇవ్వాలని నేను యువతిని కోరాను. కండక్టర్ కూడా సీటు ఇవ్వాలని చెప్పారు. కానీ యువతి ఆగ్రహంతో ఊగిపోయింది. నీ అంతు చూస్తానని, మా వాళ్లకు ఫోన్ చేశానంటూ బెదిరించింది. బస్టాండ్‌లో మా వాళ్లు వెయిట్ చేస్తున్నారని, నీ పని, నీ కొడుకు సంగతి చూస్తారంటూ హెచ్చరించింది. వర్గ విబేధాలు రెచ్చగొట్టే విధంగా నేను అసలు మాట్లాడలేదు. కండక్టర్ మరో బస్సు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదనడం వల్ల నేను ఆ బస్సులో ప్రయాణించాను. మరో బస్సులో వచ్చి ఉంటే ఈ గొడవ కూడా జరిగేది కాదు. మార్గం మధ్యలో జగిత్యాల బస్ స్టేషన్‌కు రావాలని ఆమె ఫోన్లు చేయడంతో నాకు భయం వేసింది. దీంతో నా భర్త అనిల్‌కు ఈ విషయం చెప్పాను' అని సంధ్య మీడియా ముందు తన గొడు వెల్లబోసుకుంది.

'యువతి దూషణలు తట్టుకోలేక ఏడుస్తూ నా భర్తకు ఫోన్ చేశా. బస్‌స్టేషన్ వరకు నేను రానని, బస్ డిపో వద్ద దిగుతానని చెప్పాను. దీంతో నన్ను రిసీవ్ చేసుకునేందుకు నా భర్త వచ్చారు. వివరాలు అడిగి తెలుసుకుంటున్న క్రమంలో యువతి వీడియో తీస్తుంటే నా భర్త అడ్డుకుని ఫోన్ లాక్కొవడంతో సెల్ కిందపడిపోయింది. ఫోన్ లాక్కుంటున్న క్రమంలో ఆమెకు, నాకు మధ్య జరిగిన పెనుగులాటలో నా చేతి గాజులు పగిలిపోయాయి. ఈ ఘటనలో నా చేతికి గాయం కూడా అయింది. నా భర్త యువతిని బూట్లతో కొట్టలేదు. మఫ్టీలో ఉన్న వ్యక్తి స్లిప్పర్లు వేసుకుని వస్తే బూట్లతో తన్నాడని యువతి చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు' అని సంధ్య వివరించారు.

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget