అన్వేషించండి

Karimnagar News : కరీంనగర్ హస్తకళకు జాతీయస్థాయి గుర్తింపు, సిల్వర్ ఫిలిగ్రీ వెండి పల్లకికి అవార్డు!

Karimnagar News : కరీంనగర్ కళకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. కరీంనగర్ కళాకారుడు రూపొందించిన వెండి తీగల పల్లకికి జాతీయ అవార్డు దక్కింది.

Karimnagar News : ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రి కళకి ఇప్పుడు మరో జాతీయస్థాయి అవార్డు దక్కింది. గద్దె అశోక్ కుమార్ అనే కళాకారుడు 2018లో కిలోన్నర వెండి తీగలతో వెండి పల్లకిని అద్భుతంగా తయారుచేశారు. దానిని అప్పట్లో జాతీయ అభివృద్ధి సంస్థకు పోటీ నిమిత్తమై పంపించారు. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ఈ పోటీ రిజల్ట్స్ ఈ మధ్య వెలువడ్డాయి. అందులో సిల్వర్ ఫిలిగ్రీ వెండి పల్లకికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ నుంచి ఆహ్వానం అందింది. ఈనెల 28న దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందజేయనున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల ఇళ్లల్లో కొలువుదీరిన సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కడం పట్ల పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. 

Karimnagar News : కరీంనగర్ హస్తకళకు జాతీయస్థాయి గుర్తింపు, సిల్వర్ ఫిలిగ్రీ వెండి పల్లకికి అవార్డు!

సిల్వర్ ఫిలిగ్రి చరిత్ర ఇదీ 

కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు ఏళ్లనాటి చరిత్ర ఉంది. దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిజాం నవాబుల హయాంలో మొదలై క్రమక్రమంగా ప్రాచుర్యం పొందిన ఈ ఆర్ట్ ప్రస్తుతం  దక్షిణ భారత దేశంలో ప్రాముఖ్యత వహించింది. అప్పటి నుంచి స్వర్ణకారుల చేతిలో రూపుదిద్దుకున్నటువంటి ఈ అద్భుతమైన కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో దేశాధినేతలు ఇతర ప్రముఖుల ఇళ్లలో కొలువుతీరాయి. భారతదేశానికి వచ్చిన ఏ విదేశీ అతిథికైనా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ తో చేసిన కళాఖండాన్ని జ్ఞాపికగా అందించడం ఆనవాయితీగా వస్తోంది. చారిత్రక ప్రదేశాలు అయిన చార్మినార్ , తాజ్ మహల్ , ఎర్రకోట, వీణ , మయూరం , ఇతర దేవుళ్ల ఆకృతులు,  ప్రముఖ స్థలాలను సిల్వర్ ఫిలిగ్రీ ద్వారా సుందరంగా రూపొందించేవారు. సామాన్యులను కూడా ఆకర్షించేలా చిన్న చిన్న వస్తువులను సైతం తయారు చేయడం ప్రారంభించామని వీటి తయారీదారులు అంటున్నారు. తాళంచెవి,  సిగరెట్ యాష్ ట్రే , ఇంకా అనేక రకాల తక్కువ ధరలో దొరికే జ్ఞాపికలను గిఫ్ట్ గా ఇవ్వడానికి తయారు చేయిస్తున్నామని అంటున్నారు.

Karimnagar News : కరీంనగర్ హస్తకళకు జాతీయస్థాయి గుర్తింపు, సిల్వర్ ఫిలిగ్రీ వెండి పల్లకికి అవార్డు!

ఇవాంకా ట్రంప్ కు గిఫ్టుగా 

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చే దేశ విదేశీ ప్రముఖులకు సిల్వర్ ఫిలిగ్రీతో చేసిన వీణ, చార్మినార్ కానీ గిఫ్ట్ గా ఇస్తుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టిన సందర్భంలో అతిథులుగా వచ్చిన దేవేంద్ర ఫడ్నవిస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు సిల్వర్ ఫిలిగ్రీ తో చేసిన జ్ఞాపికలును గిఫ్ట్ గా అందించారు.  హైదరాబాద్ ను సందర్శించిన  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్ కి కూడా కరీంనగర్ కళాకృతులను అందించారు. అయితే గతంలో సిల్వర్ ఫిలిగ్రీ ని నమ్ముకుంటే తమకు సరైన ఉపాధి లభించేది కాదని కానీ ఇప్పుడు ఇతర దేశాల నుంచి సైతం వస్తున్న ఆర్డర్ల వల్ల తమకు చేతినిండా పని దొరుకుతుందని కళాకారులు అంటున్నారు. అయితే మార్కెటింగ్ విషయంలో మరింత శ్రద్ధ చూపినట్లయితే కొన్ని వేల మందికి ఉపాధి కల్పించ గలిగే సత్తా ఉన్న పరిశ్రమ అని వారి అభిప్రాయం. ఇప్పటికే కుటీర పరిశ్రమగా మారి అనేక మంది మహిళలకు ఉపాధి అందిస్తున్న దీనిపై ప్రభుత్వం మరింత శ్రద్ధ పెడితే కచ్చితంగా రానున్న రోజుల్లో టర్నోవర్ మరింత పెరుగుతుందనంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget