అన్వేషించండి

Jupally Krishna Rao : డీకే అరుణ ఆహ్వానం - ఆశపెడుతున్న కాంగ్రెస్ ! జూపల్లి కృష్ణారావు దారెటు ?

జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరబోతున్నారు ? బీజేపీలోకి రావాలని డీకే అరుణ ఫోన్ చేసి ఆహ్వానించారు.


Jupally Krishna Rao :  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరబోతున్నారు ?.  భారత రాష్ట్ర సమితి నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. ఆయన పెద్దగా ఫీల్ కాలేదు. నిజానికి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని నాలుగేళ్లవుతోంది. 2018 ముందస్తు ఎన్నికల్లో తనపై గెల్చిన బీరం హర్షవర్థన్ రెడ్డిని బీఆర్ఎస్‌లో చేర్చుకున్నప్పటి నుండి జూపల్లిని పక్కన పెట్టారు. స్థానిక ఎన్నికల సమయంలో తన సొంత వర్గాన్ని నిలబెట్టుకుని పోటీగా అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు జూపల్లి. ఇలా చేసినందున హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో ఆయనకు  బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఆఫర్లు వెళ్లాయి.                 

తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ నుంచి జూపల్లి సస్పెండ్

పార్టీ మారుతారని ప్రచారం జరిగింది కానీ ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొల్లాపూర్ వెళ్లిన కేటీఆర్.. జూపల్లి ఇంటికి వెళ్లి చర్చలు కూడా జరిపారు. అంతా సర్దుకుంటుందనుకునే దశలో బీరం హర్షవర్ధన్ రెడ్డికే వచ్చే సారి కొల్లాపూర్ టిక్కెట్ ఖరారు చేసేశారు. అధికారికంగా ప్రకటించకపోయినా విషయం పై క్లారిటీ రావడంతో జూపల్లి కృష్ణారావు ప్రత్యామ్నాయం చూసుకోవాలని డిసైడయ్యారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వెళ్లి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దాంతో సస్పెండ్  చేశారు. ఇప్పుడు తాను ఏ పార్టీలో చేరాలో ఇంకా ఆయన నిర్ణయించుకోలేదు. 

తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్న బీజేపీ , కాంగ్రెస్                          

కానీ రెండు పార్టీల నుంచి ఆయనకు ఆఫర్లు ఉన్నాయి. బీజేపీ లోకి రావాలని చాలా కాలంగా ఆయనకు పిలుపులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆయనకు ప్రత్యర్థి అయిన డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆమె ఉంటే  మళ్లీ తాను బీజేపీలోకి ఎలా వెళ్తారని వెనుకడుగు వేస్తారని భావించారేమో కానీ.. డీకే అరుణతోనే స్వయంగా జూపల్లి కృష్ణారావుకు ఫోన్ చేయించి బీజేపీలోకి  రావాలని ఆహ్వానించారు. తర్వాత  బీజేపీ పెద్దలూ టచ్‌లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. 

జూపల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?                               

రాజకయంగా రేవంత్ రెడ్డితో జూపల్లి విబేధించారు కానీ.. అంత తీవ్రంగా కాదు. అందుకే ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. ఆయన మాతృపార్టీ కాంగ్రెస్ పార్టీనే. అందుకే ఇప్పుడు రెండు పార్టీల మధ్య జూపల్లి కృష్ణారావు రాజకీయ భవితవ్యం ఊగిసలాడుతోంది. ఏ పార్టీలో చేరినా కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రత్యర్థి ఆయనే అవుతారు. అది ఏ పార్టీ అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.                          

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వైసీపీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై ఈడీ ఫోకస్ 
వైసీపీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై ఈడీ ఫోకస్ 
Harish Rao Milchy Milk Controversy: హరీష్ రావు చుట్టూ ముదురుతున్న పాల రాజకీయం - మిల్చీమిల్క్‌పై సమాధానం చెప్పలేరా?
హరీష్ రావు చుట్టూ ముదురుతున్న పాల రాజకీయం - మిల్చీమిల్క్‌పై సమాధానం చెప్పలేరా?
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget