అన్వేషించండి

Medigadda barrage: కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన - తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు

Medigadda Barrage: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీపై రహదారి కుంగింది. దీంతో తెలంగాణ - మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మి) గ్యారేజీ వంతెన ఒక్కసారిగా కుంగింది. మహాదేవపూర్ మండలం అంబటిపల్లి శివారులోని బీ బ్లాకులో 18, 19, 20, 21 పిల్లల మధ్య ఉన్న వంతెన శనివారం రాత్రి భారీ శబ్దంతో ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20 ఫిల్లర్ కుంగడంతోనే పైన వంతెన దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

అధికారులు అప్రమత్తం

బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. నీటి పారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో భారీ శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్య నిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోను మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. 

16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో సంఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. రాత్రి సమయంలో వంతెన పొంగిన నేపథ్యంలో ఇంజినీర్లు ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొదట 12 గేట్లు, ఆ తర్వాత వాటిని 46 పెంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 50 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉదయానికి కొంత మేర జలాశయాన్ని ఖాళీ చేసి వంతెన కుంగిన ప్రాంతం దిగువన బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు ఇంజినీర్లు తెలిపారు.

రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే వంతెన పొంగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భారీ శబ్దం నేపథ్యంలో డ్యాం ఇంజనీరు మహారాష్ట్ర వైపు సిరోంచ, తెలంగాణ వైపు మహాదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎల్ అండ్ టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రి మేడిగడ్డకు చేరుకున్నారు. డ్యాం పైభాగాన్ని ఈఈ తిరుపతిరావు పరిశీలించారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget