అన్వేషించండి

NIMS ఐపీ, ఓపీ పేషెంట్ల వివరాలపై నిత్యం మానిటరింగ్

NIMS, MNJ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో మంత్రి హరీశ్ రావు

నిమ్స్ ఆసుపత్రిలో అంతర్గత ఆన్ లైన్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభాగాల వారీగా ఓపీ, ఇన్ పేషెంట్ వారీగా ఒక్క క్లిక్ దూరంతో సమాచారం తెలుసుకునేందుకు ఇంటర్నల్ ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. అంటే, ఓపీ రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి టెస్టులు చేసుకొని, ఫలితాలు వచ్చి, వైద్యుడిని కలిసి ట్రీట్‌మెంట్ పొందేవరకు.. ఈ ప్రాసెస్ అంతా పర్యవేక్షించేందుకు అంతర్గత ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. దీనికోసం ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. NIMS, NNJ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో ఈ విషయం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమై ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాయని హరీష్ రావు అన్నారు. నిమ్స్ పై ప్రజల్లో నమ్మకం ఉందని, దాన్ని కాపాడుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

కొంతకాలంగా చేస్తున్న కృషివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్ కొరత లేకుండా చూడటంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు. అయితే ఎమర్జెన్సీ బెడ్స్ నిర్వహణ మరింత మెరుగవ్వాలని సూచించారు. స్టెబిలైజ్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు పేషెంట్లను సంబంధిత వార్డులకు షిప్టు చేస్తూ, ఎమర్జెన్సీలో బెడ్స్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

 

ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ బిల్లుల చెల్లింపు కోసం కొత్త కౌంటర్లు ప్రారంభించడం శుభపరిణామం అన్నారు మంత్రి హరీష్ రావు. నిమ్స్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం, నిలోఫర్ పీడియాట్రిక్ విభాగం కలిసి యూకే వైద్య బృందం సహకారంతో చిన్నారులకు గుండె సర్జరీలు నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. అవసరమైన వారికి చికిత్స అందించేలా ప్లాన్ చేయలన్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి వీలైతే అదేరోజు ఓపీ, కన్సల్టేషన్, టెస్టులు, డాక్టర్ మెడికల్ అడ్వైజ్ పూర్తయ్యేలా చూడాలన్నారు. దీనికోసం రివ్యూ ఓపీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 

ఇకపోతే, హాస్పిటల్ పరిసరాల్లో, లోపల పారిశుద్ధ నిర్వహణ, తాగునీటి వసతి విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రాబోయే వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నిమ్స్ ఆసుపత్రి నుంచి బయటి వాహనాలు రాకపోకలు కొనసాగించకుండా చూడాలన్నారు. వాయు కాలుష్యం, సౌండ్ పొల్యూషన్ తగ్గించాలని సూచించారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు పేషెంట్లకు, వారి అటెండెంట్లకు సహకరించాలన్నారు.

 

మొబైల్ కేన్సర్ స్క్రీనింగ్ ను ఎక్కువగా జిల్లాల్లో నిర్వహించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. కొత్తగా ప్రారంభించిన మాడ్యులర్ థియేటర్లు పూర్తిస్థాయిలో పని చేయాలన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 300 పడకల MNJ కొత్త బ్లాక్ ప్రారంభిస్తామని తెలిపారు.

 

నిమ్స్ ఆసుపత్రికి మంత్రి అభినందనలు:

 

జనవరి నెలలో 15 కిడ్నీ మార్పిడి సర్జీలు పూర్తిచేసి నిమ్స్ ప్రతిష్టను జాతీయస్థాయికి తీసుకెళ్లినందుకు వైద్యులను అభినందనలు తెలిపారు మంత్రి హరీష్ రావు. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ ప్లాంటేషన్ వెబ్ సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం, డోనర్లు, సర్జరీల విషయంలో 2022 ఏడాదికి తెలంగాణ దేశంలోనే నెంబర్1గా ఉందనీ హర్షం వ్యక్తం చేశారు. దీని వెనుక నిమ్స్ కృషి చాలా ఉందనీ, జీవనానంద్ కోఆర్డినేటర్ డా. స్వర్ణలత, డీఎంఈ, నిమ్స్ డైరెక్టరుకు హరీష్ రావు అభినందనలు చెప్పారు.

 

అలాగే ఆర్థో విభాగానికి సంబంధించి స్కోలియోసిస్ (గూని) సమస్య ఉన్నవారికి గడిచిన 3 ఏళ్లలో 200 మందికి సర్జరీలు చేసి నిమ్స్ వైద్యులు చికిత్స అందించారనీ, గతేడాదిలోనే దాదాపు 80 సర్జరీలు చేయడం గొప్ప విషయమని అన్నారు. వైద్య బృందాన్ని మంత్రి అభినందించారు. పరిశోధనల విషయంలో నిమ్స్, MNJ ఆసుపత్రులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది హరీష్ రావు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
El Nino Effect: వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget