అన్వేషించండి

VC Sajjanar: రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డ యువతి - జాగ్రత్తగా ఉండాలంటూ వీసీ సూచన

VC Sajjanar: రైల్లో ప్రయాణిస్తూ డోర్ వద్ద నుంచి తల బయటకు పెట్టిన ఓ అమ్మాయిని తోటి ప్రయాణికులు కాపాడారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. వీసీ సజ్జనార్ ప్రయాణికులంతా జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేశారు. 

VC Sajjanar: రైల్లో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి డోర్ వద్ద నిల్చొని తల బయటకు పెట్టింది. క్షణాల్లోనే మరో రైలు పక్కనే ఉన్న పట్టాలపైకి రాగా.. వెంటనే ఇతర ప్రయాణికులు ఆ అమ్మాయిని లోపలికి లాగగా.. ప్రాణాలతో బయట పడింది. అయితే ఈమె చాలా అదృష్టవంతురాలని, అందుకే రెప్పపాటు కాలంలో ప్రాణాలతో బయట పడిందంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అలాగే ప్రయాణం చేసేటప్పుడు సరదా కోసం ఇలాంటి పనులు అసలే చేయొద్దని సూచించారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదం అని.. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  

చిన్న సమస్యలకే ఆత్మహత్య వద్దంటూ సూచన

చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి ప్రజలు బలవన్మరణాలకు పాల్పడటం బాధాకరం అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన సమస్యలు ఎక్కడికి పోవని అన్నారు. కష్టాలు, సమస్యలను బతికుండి దైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అంతేకానీ క్షణికావేశంలో ప్రాణాలను పోగొట్టుకుని కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దని చెప్పుకొచ్చారు. ఇటీవలే హైదరాబాద్ లోని కొండాపూర్ లో రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తీవ్ర గాయాలపాలైన అతడు.. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. ఇదే విషయాన్ని చెబుతూ.. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.

ఇటీవలే సిగ్నల్స్ వద్ద ఆత్రం వద్దంటూ ట్వీట్

సిగ్న‌ల్స్ వ‌ద్ద ఆత్రం ఏమాత్రం ప‌నికి రాదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో బైక్ పై వెళ్తున్న ఓ జంట సిగ్నల్ క్రాస్ చేయబోతుండగా.. లారీ కిందకు చొచ్చుకుపోయారు. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి ప్రమాదమూ జరలేదు. అయితే ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కాగా... వీసీ సజ్జనార్ ట్టిట్టర్ ద్వారా నెటిజెన్లతో పంచుకున్నారు. అందరికి వీరిలా అదృష్టం ఉండదని.. సిగ్నల్స్ వద్ద ఏమాత్రం ఆత్రం పనికి రాదని వివరించారు. అలాగే ర‌హ‌దారుల‌పై లేన్ డ్రైవింగ్‌ను విధిగా పాటించాలని సూచించారు. ఇలా అడ్డదిడ్డంగా వెళ్లి రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మై విలువైన ప్రాణాల‌ను పోగొట్టుకోకండని హితవు పలికారు.

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget