అన్వేషించండి

Kishan Reddy: అధికారంలోకి రాగానే ఆ పార్టీల భూమి పట్టాలను రద్దు చేస్తాం: కిషన్‌ రెడ్డి

పేదల భూములను బీఆర్‌ఎస్‌ వ్యాపారులకు కట్టబెడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కోకాపేటలోని ఏకంగా 11 ఎకరాల భూమిని బీఆర్‌ఎస్‌ తీసుకున్నది నిజమా కాదా అంటూ ఆయన ప్రశ్నించారు.

పేదల భూములను బీఆర్‌ఎస్‌ వ్యాపారులకు కట్టబెడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కోకాపేటలోని ఏకంగా 11 ఎకరాల భూమిని  బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇచ్చింది నిజమా కాదా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ తో పాటు కాంగ్రెస్‌ కూడా కుమ్మక్కై వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తమ రాజకీయ పనుల్లో అవసరమయ్యే డబ్బులు కోసం ఇప్పటి నుంచే భూములను సమకూర్చుకుని.. అనంతరం వాటిని అమ్మి ఆ డబ్బులను ఎన్నికల టైమ్‌ లో ఉపయోగిస్తారని ఆయన మండిపడ్డారు. 

ఆ పార్టీల భూమి పట్టాలను రద్దు చేస్తాం.. 
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రెండు పార్టీలకు ఇచ్చిన భూమి పట్టాలను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ భూములను అమ్మడం అంటే ప్రజలను మోసం చేయడమే అని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారన్నారు. ఈ భూముల వేలం అనేది ఒక దుర్మార్గపు చర్య. 

సంపద సృష్టించాల్సింది పోయి భూములు అమ్మి నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీని వల్ల వ్యవస్థ కూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని కోసమేనా కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివింది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. పేదప్రజలకు ఇళ్లు కట్టడానికి స్థలం కనిపించదు కానీ..పెద్ద వ్యాపారులకు అమ్ముకునేందుకు మాత్రం స్థలాలు కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నించారు.

ముందు తరాల వారికి చెందాల్సిన, ఉపయోగపడాల్సిన భూములను అమ్మడం అనేది సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. ప్రజల కోసం సైన్స్ సిటీని నిర్మించడానికి భూమి ఇవ్వమంటే ఇవ్వని కేసీఆర్ .. కాంగ్రెస్‌ కార్యాలయం కోసం మాత్రం 10 ఎకరాల భూమిని ఇచ్చారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రాజశేఖర్‌ రెడ్డి భూములు అమ్మితే కేటీఆర్‌ వ్యతిరేకించారని ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం అధికారంలోకి రాగానే వీరే భూములు అమ్మడం మొదలు పెట్టారని విమర్శించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget