అన్వేషించండి

TSRTC: టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రైల్వే తరహా ప్రత్యేక వ్యవస్థ, అంతా అరచేతిలోనే తెలిసిపోయేలా

TSRTC News: ఫోన్‌లలో ‘టీఎస్‌ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’ అనే యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఏ బస్సు ఎక్కడుందోతెలియజేసే  ట్రాకింగ్‌ సేవలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

TSRTC Bus Tracking:  మీరు మీ జీవితంలో ఎన్నో సార్లు బస్సుల కోసం వేచి చూశారా? అసలు బస్సు వస్తుందో, రావట్లేదో లేదా వచ్చి వెళ్లి పోయిందో తెలియక అలాగే పడిగాపులు కాయడం మనందరికీ అనుభవమే. తరచూ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ సమస్య ఎప్పటినుంచో ఉంది. తాము ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో, ఇంకా ఎంత సేపటికి వస్తుందో తెలిస్తే చాలా సౌకర్యంగా ఉంటుంది. పడిగాపులు కాసే పరిస్థితి తప్పుతుంది. ఇప్పుడు టీఎస్ ఆర్టీసీ ఆ దిశగా కసరత్తు చేసింది.

ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునే సాంకేతిక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మొబైల్‌ ఫోన్‌లలో ‘టీఎస్‌ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’ అనే యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఏ బస్సు ఎక్కడుందోతెలియజేసే  ట్రాకింగ్‌ సేవలను మంగళవారం (జూలై 26) ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అయితే, ప్రస్తుతానికి హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్‌ ఏసీ బస్సులతో పాటు, హైదరాబాద్‌ నుంచి విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, ఏలూరు, విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు వెళ్లే దూరప్రాంత బస్సుల్లోనూ ట్రాకింగ్‌ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే రైళ్లలో ఈ సదుపాయం ఉంది. రైల్ యాత్రి అనే యాప్ ద్వారా రైలు లైవ్ స్టేషన్ ను తెలుసుకోవచ్చు.

ప్రయాణికులు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి TSRTC Bus Tracking యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. తెలంగాణలో 96 డిపోల్లో ఎంపిక చేసిన 4,170 బస్సుల్లో ఈ ట్రాకింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీంతో ప్రయాణికుడు తాను ఎక్కవలసిన బస్సు ఎక్కడుందో ఆ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలానా బస్టాప్‌కు ఆ బస్సు ఎంత సమయంలో చేరుకుంటుందనే అంచనా సమయం కూడా తెలవనుంది. రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలకు తెలంగాణ బస్సులు వెళ్లిన సందర్భంలోనూ ట్రాకింగ్ చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌  తెలిపారు.

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 140 బస్సులను ఎంపిక చేయగా, కంటోన్మెంట్, మియాపూర్‌ - 2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్‌ బస్సుల్లో ట్రాకింగ్‌ సదుపాయం ఉంది. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం, తదితర రూట్లలో నడిచే మరో 100 బస్సుల్లోనూ ట్రాకింగ్ సిస్టమ్ ను అమర్చారు. త్వరలో హైదరాబాద్ లోని అన్ని రిజర్వేషన్‌ సర్వీసులను కూడా ట్రాకింగ్‌ యాప్‌లో అందుబాటులోకి తేనున్నారు. ఈ యాప్ ద్వారా కండక్టర్, డ్రైవర్, తదితర సిబ్బంది ప్రవర్తనపై కూడా ప్రయాణికులు తమ ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
Special Trains: విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget