అన్వేషించండి

Telangana 3వ స్థానంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ యూపీకి చివరి స్థానం: మంత్రి హరీష్ రావు

నీతి ఆయోగ్ ర్యాంకింగ్ లో తెలంగాణ 3 వ స్థానంలో ఉంటే, డబుల్ ఇంజన్ ప్రభుత్వం యూపీ చివరి స్థానంలో నిలిచిందని తెలంగాణ ఆర్థిక, వైద్య  మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం, జాతీయ స్థాయి సంస్థల నుంచి అనేక అవార్డులు తెలంగాణకు ఇచ్చిందని.. కొంతమంది డబుల్ ఇంజన్ అంటారు. కానీ నీతి ఆయోగ్ ర్యాంకింగ్ లో తెలంగాణ 3 వ స్థానంలో ఉంటే, డబుల్ ఇంజన్ ప్రభుత్వం యూపీ చివరి స్థానంలో నిలిచిందని తెలంగాణ ఆర్థిక, వైద్య  మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వైద్యరంగానికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హరీశ్‌ రావు తెలిపారు. మాతా, శిశు మరణాల రేటు అతి తక్కువగా ఉన్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. 2014 నాటికి రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39 కాగా, ప్రస్తుతం 21కి తగ్గిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి నివేదికను మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. ప్రగతి నివేదికలు మా పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. గత బడ్జెట్లో 11వేలకు పైగా నిదులు వైద్యశాఖకు సీఎం కేటాయించారని మంత్రి హరీష్ రావు తెలిపారు. గత ఏడాది ఒకటి రెండు ఘటనలు మాకెంతో బాధను కలిగించింది..అలాంటి ఘటనలు మళ్ళీ పునావృత్తం కాకుండా సరిచేసుకున్నాం. తెలంగాణ వైద్యశాఖ దేశానికి ఆదర్శంగా ఉంది.. మనకంటే కేరళ, మహారాష్ట్ర మాత్రమే కొన్ని రంగాల్లో మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. 

2022 వైద్యశాఖకు లికించదగిన ఏడాదిగా చెప్పుకుంటాం. ఉమ్మడి ఏపీలో 3 మూడు మెడికల్ కాలేజీలు వస్తే.. రాష్ట్రం వచ్చాక 8 మెడికల్ కాలేజీలు వచ్చాయని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2వందలకు పైగా పీజీ సీట్లు 2022లోనే తెచ్చుకున్నాం. MBBS, PG సీట్లలో జనాభా ప్రాతిపదికన దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సనత్ నగర్, ఎల్బీనగర్, అల్వాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పనులు మొదలయ్యాయి. డయజ్ఞోస్టిక్, డయాలసిస్ సేవలు మెరుగయ్యాయన్నారు.

ఆరోగ్య రాష్ట్రంగా తెలంగాణ
ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా మార్చుకునేందుకు అడుగులు మొదలయ్యాయని, 2022లో 4- కోట్ల 80లక్షల మంది op ఇన్ పేషెంట్ సేవలు అందించామని వైద్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. 2022లో 2లక్షల 50 వేల సర్జరీలు జరిగాయి. 2022లోనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కంటి వెలుగు, ప్రారంభించుకున్నాం. ఒకే రోజు 926 వైద్యుల నియామకం, 8 మెడికల్ కాలేజీల ప్రారంభం, మరో 9 ప్రారంభానికి జీవో విడుదల చేశామని నివేదికలో వెల్లడించారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య గతంతో పోల్చితే డబుల్ అయ్యాయి. 2022లో 3లక్షలకు పైగా డెలివరీలు ప్రభుత్వం ఆసుపత్రుల్లో జరిగాయి. ప్రతి మరణం పట్ల ప్రభుత్వం రివ్యూ చేస్తోంది. మరణాలు లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెకానిజం మేము నేర్చుకున్నాం. ఇబ్రహీంపట్నం ఘటన తరువాత ప్రత్యేక శిక్షణ ఇచ్చాము

‘2022లో 47లక్షల మంది బస్తీ ధవాఖానాల ద్వారా సేవలు అందించాం. కానీ బస్తి ధవాఖాల వల్ల గాంధీ, ఉస్మానియా, ఫీవర్ హాస్పిటల్స్ ఓపి సేవలు మూడు రేట్లు తగ్గాయి. 2022లో 7 వందలకు పైగా ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ లు చేసుకున్నాం. కరోనా వ్యాక్సిన్ వేయడంలో తెలంగాణ పనితీరు బాగుంది. ప్రికాషనరీ డోస్ వేయడంలో జాతీయ సగటు కంటే డబుల్ తెలంగాణ ఉంది. ఆరోగ్యశ్రీ సేవలపై కొంతమంది అందడం లేదని తెలిసితెలియక విమర్శలు చేస్తున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ 2లక్షలు ఉంటే.. ఇప్పుడు 5 లక్షలు చేశాం. కొన్ని పెద్ద వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు ఇస్తున్నాం. 12వేలకు పైగా ఉద్యోగాల ఖాళీలు ఉంటే... వీలైనన్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ వేస్తున్నామని ’ మంత్రి హరీష్ రావు అభివృద్ధి నివేదికలో వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
PV Sindhu Marriage Latest Photos: పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
Embed widget