అన్వేషించండి

TGSRTC News: ఎలక్ట్రిక్ సూపర్‌ లగ్జరీ సర్వీస్‌లు రెడీ, ఈ-బస్సులు కొనకుండా TGSRTC ప్లాన్!

TGSRTC Electric Buses: కరీంనగర్‌ - హైదరాబాద్, నిజామాబాద్‌ - హైదరాబాద్‌ మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సుల్ని తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీటికి ఈ-సూపర్‌ లగ్జరీగా పేరు పెట్టారు.

Telangana RTC e Super Luxury Buses: తెలంగాణ ఆర్టీసీ తన బస్సుల శ్రేణిని అప్ గ్రేడ్ చేస్తూనే ఉంది. పాతబడ్డ బస్సుల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త బస్సులను ప్రవేశపెడుతూనే ఉంది. గతేడాది ఈ-గరుడ, కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ లో పదుల సంఖ్యలో ఏసీ, నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను కూడా తిప్పుతోంది. తాజాగా జిల్లాలకు నడిపే నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సుల స్థానంలో ఈ-సూపర్ లగ్జరీ బస్సులను తీసుకురానుంది. కరీంనగర్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - కరీంనగర్ మధ్య ఈ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది. 

తొలిదశలో కరీంనగర్‌ - హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, నిజామాబాద్‌ - హైదరాబాద్‌ లేదా సికింద్రాబాద్ మార్గాల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీటికి ఈ-సూపర్‌ లగ్జరీగా పేరు పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే కరీంనగర్‌-2 డిపోకు 35 ఎలక్ట్రిక్ బస్సులు, నిజామాబాద్‌-2 డిపోకు 13 ఎలక్ట్రిక్ బస్సులు చేరుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

అయితే, ఈ బస్సుల్ని ఆర్టీసీ కొనుగోలు చేయకుండానే తిప్పుతోంది. ప్రైవేటు సంస్థల నుంచి ఆర్టీసీ.. ఎలక్ట్రిక్‌ బస్సుల్ని అద్దె ప్రాతిపదికన తీసుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో సిటీ బస్సులు, హైదరాబాద్‌-విజయవాడ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో ఏసీ, నాన్‌ ఏసీ మెట్రోడీలక్స్‌ బస్సులు ఉన్నాయి. సూపర్‌ లగ్జరీలో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. త్వరలోనే వీటిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించనున్నారు. 

ఆర్టీసీ సంస్థకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవసరమైన మేరకు కొత్త బస్సులను కొనుగోలు చేయడం కష్టంగా మారింది. కానీ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో వెనకడుగు వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలవైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే డీజిల్‌ బస్సుల నుంచి ఎలక్ట్రిక్‌ బస్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త బస్సులు కొనే ఖర్చు అధికంగా ఉండడం కారణంగా.. అద్దె పద్ధతిలో ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకుంటున్నారు. వీటిల్లో డ్రైవర్లుగా బస్సు తయారీ సంస్థ సిబ్బందే ఉండనున్నారు. కండక్టర్లు మాత్రం ఆర్టీసీ సంస్థ నుంచి ఉండనున్నారు. ఈ బస్సులకు కిలో మీటర్ల వారీగా ఆర్టీసీ అద్దె చెల్లిస్తూ ఉండనుంది.

టాప్ హెడ్ లైన్స్

Sonia Gandhi Biopic: సోనియా గాంధీ బయోపిక్‌ డైరెక్టర్ ఫిక్స్.. క్రాంతి మాధవ్ పేరును ప్రకటించిన జగ్గారెడ్డి!
సోనియా గాంధీ బయోపిక్‌ డైరెక్టర్ ఫిక్స్.. క్రాంతి మాధవ్ పేరును ప్రకటించిన జగ్గారెడ్డి!
KTR on Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. ఏబీపీ వేదికగా ముందే చెప్పిన కేటీఆర్!
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. ఏబీపీ వేదికగా ముందే చెప్పిన కేటీఆర్!
Tension at Palnadu Water Grid: పల్నాడు వాటర్ గ్రిడ్ వద్ద ఉద్రిక్తత.. ఆందోళన చేపట్టిన కవిత పార్టీ నేతలపై దాడి! ఆపై అరెస్ట్
పల్నాడు వాటర్ గ్రిడ్ వద్ద ఉద్రిక్తత.. ఆందోళన చేపట్టిన కవిత పార్టీ నేతలపై దాడి! ఆపై అరెస్ట్
Baba Fasiuddin: హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్య కుట్ర భగ్నం.. ఐదుగురి అరెస్ట్
హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్య కుట్ర భగ్నం.. ఐదుగురి అరెస్ట్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
Rayapati Sambasiva Rao Passes Away: మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
Amanchi Krishna Mohan: వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
PM Modi Tirupati Tour: ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
KTR: తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget