అన్వేషించండి

Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 

Tesla Hyderabad:హైదరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీలో టెస్లా తన తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. మోడల్ Yలో రెండు వేరియంట్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 

Tesla Experience Centre Hitec City::హైదరాబాద్‌ ఐటీ హబ్‌లో మరో గ్లోబల్ జెయింట్ కొలువుదీరింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టెస్లా ఎట్టకేలకు భాగ్యనగరంలో తన ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించింది. నాలెడ్జ్ సిటీ వేదికగా తన మొదటి ఎక్స్‌పీరియ్స్‌ సెంటర్‌ను ప్రారంభించడమే కాకుండా భారతీయ రోడ్లపైకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సరికొత్త మోడల్‌ Y వేరియంట్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 

మీరు గనుక ఎలక్ట్రిక్ కార్ల ప్రేమికులైతే, మీ డ్రీమ్ కారు కేవలం ఒక క్లిక్ దూరంలో ఉంది. అత్యాధునిక ఏఐ టెక్నాలజీ, మెరుపు వేగంతో దూసుకెళ్లే పికప్‌, సూపర్ ఛార్జింగ్ సౌకర్యాలతో టెస్లా ఇప్పుడు హైదరాబాద్ వాసులను పలకరిస్తోంది. ఈ కొత్త కార్ల ధర ఎంత? బుకింగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. 

Image

నాలెడ్జ్ సిటీలో టెస్లా అడ్డా

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని నాలెడ్జ్‌ సిటీలో టెస్లా తన తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించింది.  భారత్‌లో టెస్లాకు ఇది ఐదో కేంద్రం. మొదటి సెంటర్‌ను ముంబైలో గత ఏడాది ప్రారంభించింది. ఇక్కడ వినియోగదారులు నేరుగా కార్లను చూడటమే కాకుండా, టెస్లా అడ్వైజర్ల సమక్షంలో కారులోని ఫీచర్లను క్షుణ్ణంగా తెలుసుకునేందుకు గైడెడ్ వాక్ రౌండ్స్‌ సౌకర్యం కూడా ఉంది. కేవలం షోరూమ్ మాత్రమే కాదు. బొల్లారంలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఆఫ్టర్‌ సేల్స్ సర్వీసెస్‌ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Image

మోడల్ Y ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్

టెస్లా లాంచ్ చేసిన వాటిలో 2026 మోడల్ వై ప్రీమియం రియర్‌ వీల్ డ్రైవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని ప్రత్యేకతలు చూస్తే... ఇందులో 2,138 లీటర్ల స్టోరేజ్‌ స్పేస్ ఉంటుంది. ఇది కేవలం 5.9 సెకన్లలోనే 0 నంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని ప్రారంభ ధర 50, 89, 000 రూపాయలు కాగా, ఆరు లక్షల డౌన్ పేమెంట్‌తో సొంతం చేసుకోవచ్చు. నెలకు 39, 990 నుంచి ఈఎంఐ ప్రారంభమవుతుంది. 

Image

ఫ్యామిలీ కారుగా మోడల్ వై ఎల్‌   

పెద్ద కుటుంబాలకు కోసం టెస్లా మోడల్ వైఎల్‌ను తీసుకొచ్చింది. ఇందులో మూడు వరుసల సీటింగ్ ఉండటంతో డ్రైవర్, ప్యాసింజర్లకు కంఫర్ట్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. ఇది మరింత వేగంగా కేవలం 5.౦ సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని టచ్ చేస్తుంది. లాంగ్ జర్నీల కోసం కంగా 681కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది. దీని ధర 61, 99,000 నుంచి ప్రారంభమవుతుంది. డౌన్ పేమెంట్‌ 6.5లక్షలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు. మిగతా అమౌంట్‌ను నెలవారిగా చెల్లించవచ్చు. ఈ కారు తీసుకోవాలంటే ఈఎంఐ 49, 990 రూపాయులుగా నిర్ణయించారు. 

Image

టెస్లా కారులో గ్రోక్ మ్యూజిక్ 

టెస్లా ఇండియా హెడ్ శరద్‌ అగర్వాల్ ప్రకారం, ఈ కార్లలో రియల్ వరల్డ్‌ ఏఐని భారీ స్థాయిలో యూజ్ చేశారు. ఈ కార్లలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇవి నిరంతరం డేటాను సేకరిస్తూ యూజర్లకు అద్భుతమైన సెల్ఫ్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఇండియాలోని టెస్లా కార్లలో సరికొత్త గ్రోక్‌ బాట్‌ను కూడా ఇంటిగ్రేట్ చేసినట్టు సంస్థ ప్రకటించింది. 

Image

సూపర్ ఛార్జింగ్ అండ్ మెయింటెనెన్స్‌

టెస్లా కార్లకు ఇతర కార్లలాగా రెగ్యులర్‌ మెయింటెనెన్స్‌ షెడ్యూల్స్‌ ఉండవు. ఏదైనా సమస్య వస్తే మెజారిటీ సమస్యలను రిమోట్ పద్ధతిలో ఫిక్స్ చేయవచ్చు. ఒక వేళ కుదరకపోతే 24/7 మొబైల్‌ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో టెస్లా సూపర్ ఛార్జర్లు లేనప్పటికీ, త్వరలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే కేవలం 15నిమిషాల్లోనే 275 కిలోమీటర్లు ప్రయాణించేంత పవర్ అందుతుందని సంస్థ చెబుతోంది. 

టెస్లా కార్ల డెలివరీలు జులై 2026 నుంచి ప్రారంభంకానున్నాయి. వినియోగదారులు నేరుగా టెస్లా వెబ్‌సైట్ ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

El Nino Effect: వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
KBR Park Elevated Corridors: కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget