అన్వేషించండి

Telangana Assembly Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్నాయి.
  • ప్రజా సమస్యలు, భూవివాదాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి.
  • సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఆగ్రహం.
  • రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం వాదన.

Telangana Assembly Monsoon Session | హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల సమయంలో ఈ సమావేశాలు నిర్వహించనుండటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తొలి రోజు సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (BAC) భేటీలో ఉభయ సభలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై  నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక బిల్లులు, విధానపరమైన నిర్ణయాలను సభ ముందు ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది.


మరోవైపు, ప్రజా సమస్యలు, హామీల అమలు, భూముల వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పక్షాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న రిజిస్ట్రేషన్ల చట్టంలోని వివాదాస్పద 22 ఏ నిషేధిత భూముల అంశంపై చర్చ జరుగుతుందా అని ఆసక్తి నెలకొంది. రైతులకు ప్రాజెక్టుల నుంచి సాగునీటిని సకాలంలో విడుదల చేయకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసినవి ఆరోపణలేనని నిలదీసేందుకు కేటీఆర్, హరీష్ రావు టీం ప్లాన్ చేయనుంది. రాష్ట్రంలో  ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, పాలిటెక్నిక్ కాలేజీల సమస్యలు, సభలో నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.

విదేశీ పర్యటన ఆంక్షలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విదేశాలకు వెళ్లగా యూకే పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అమెరికా పర్యటనకు మాత్రం కొర్రీలు పెట్టడాన్ని తప్పుపట్టారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..  విద్య, క్రీడా రంగాలకు సంబంధించి పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం ఆకర్షించడమే లక్ష్యంగా విదేశీ పర్యటన కోసం విదేశాంగ శాఖకు ముందే పూర్తి వివరాలు సమర్పించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తూ అమెరికా పర్యటనకు మాత్రం నిరాకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ సీఎంకు విదేశీ పర్యటనలు, రోడ్ షోలకు సులభంగా అనుమతులు ఇచ్చి, తెలంగాణ సీఎం పర్యటనను అడ్డుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. "కేంద్రం భౌతికంగా నన్ను అడ్డుకోగలదు, కానీ నా ఆలోచనలను, తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షలను కాదనలేదు" అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగత అవమానం కాదని, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయమని పేర్కొన్నారు. కేంద్ర వైఖరిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు.

రైజింగ్ తెలంగాణ 2047 ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకుంటే, కేంద్రంలోని బీజేపీ నేతలు విచక్షణ మరిచిపోయి ఈ అధికారిక పర్యటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, రెండు ప్రభుత్వాలు మరియు ప్రజాప్రతినిధుల మధ్య ఫెడరల్ సత్సంబంధాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

 

Frequently Asked Questions

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయి?

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది తొలి రోజు స్పీకర్ నేతృత్వంలో జరిగే BAC భేటీలో నిర్ణయిస్తారు.

ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఏయే అంశాలపై దృష్టి సారించనుంది?

ప్రభుత్వం పలు కీలక బిల్లులు, విధానపరమైన నిర్ణయాలను సభ ముందు ఉంచే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలు, హామీల అమలు, భూముల వివాదంపై నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు ఎందుకు అనుమతి నిరాకరించబడింది?

కేంద్ర ప్రభుత్వం యూకే పర్యటనకు అనుమతించినా, అమెరికా పర్యటనకు మాత్రం నిరాకరించింది. విద్య, క్రీడా రంగాలకు పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన లక్ష్యం అని సీఎం తెలిపారు.

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు?

కేంద్రం వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయమని ఆయన పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: టెక్నాలజీ ఎంత పెరిగినా బ్లూకాలర్ ఉద్యోగాలకు ఢోకా లేదు - సీఎం రేవంత్ రెడ్డి
టెక్నాలజీ ఎంత పెరిగినా బ్లూకాలర్ ఉద్యోగాలకు ఢోకా లేదు - సీఎం రేవంత్ రెడ్డి
Telangana Education System: తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Mahesh Kumar Goud: భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Kulgam Terrorist Attack: కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Rohit Sharma Captaincy: రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
Embed widget