Fake Doctors: హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ దాడులు.. 12 మంది ఫేక్ డాక్టర్ల గుట్టురట్టు
హైదరాబాద్‌లో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి క్లినిక్‌లు నడుపుతున్న 12 మంది డాక్టర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి వైద్య పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: నగరంలో ఎలాంటి సరైన అర్హతలు లేకుండా నకిలీ డాక్యుమెంట్స్‌తో డాక్టర్లుగా చెలామణి అవుతున్న 12 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ పేరిట విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన మెడికల్ అర్హతలు లేకపోయినప్పటికీ వీరు క్లినిక్‌లు ఏర్పాటు చేసి, ప్రజలకు సెలైన్లు, ఇంజక్షన్లు, మెడిసిన్ ఇస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.
ఈ తనిఖీల్లో భాగంగా పారామెడికల్ కోర్సు పూర్తి చేసిన ఒక మహిళ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గత కొన్నేళ్ల నుంచి అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దొరికిన ఈ 12 మంది ఫేక్ డాక్టర్లను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున సెలైన్ బాటిళ్లు, బీపీ టెస్టింగ్ పరికరాలు, సర్జికల్ కత్తెరలు, పలు రకాల మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















