అన్వేషించండి

స్నేహితులను కలవడం ఇదే చివరిసారి- గ్యామ్ మీట్‌లో ఓయూ పూర్వవిద్యార్దుల భావోద్వేగం!

ఉస్మానియా యూనివర్శిటీలో పూర్వ విద్యార్థులు భేటీ అయ్యారు. నాలుగు దశాబ్దాలుగా ఓయూలో చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డవారంతా వచ్చారు. మరోసారి యూనివర్శిటీ లైఫ్‌లోకి పరకాయ ప్రవేశం చేశారు.

వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో తొలిసారి జరిగిన గ్యామ్ మీట్ అపూర్వ స్పందన వచ్చింది. నాలుగు దశాబ్దాల క్రితం ఓయూలో చదువుకుని ,వివిధ శాఖల్లో ఉన్నత స్థానంలో కొలువుదీరిన పూర్వ విద్యార్దులతంతా ఈ గ్లోబల్ అల్యూమ్నీ మీట్ (GAM)లో ఒక్కటైయ్యారు.

రెండు రోజులపాటు జరిగిన మీట్ లో ఓయూకు వెన్నుదన్నుగా నిలబడేందుకు పూర్వ విద్యార్దులు తీసుకున్న పలు కీలక ఒప్పందాలు, ఇచ్చిన విరాళాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఓయూలో పూర్వ విద్యార్దులు అరకొరగా కలిసినప్పటికీ ఈ స్దాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్దులంతా ఒక్కటవ్వడం ఇదే తొలిసారి కావడం ప్రత్యేకత సంతరించుకుంది.
స్నేహితులను కలవడం ఇదే చివరిసారి- గ్యామ్ మీట్‌లో ఓయూ పూర్వవిద్యార్దుల భావోద్వేగం!
ఉస్మానియా యూనివర్సిటీలో రెండు రోజులపాటు జరిగిన గ్యామ్ మీట్ ఓయూ విద్యార్దుల్లో కొత్త జోష్ నింపింది. మీట్ లో భాగంగా మొదటి రోజు ఓయూలో చదువున్న పూర్వ విద్యార్దులైన సినీ ,రాజకీయ ప్రముఖులతోపాటు పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హజరయ్యారు. తాము చదువుకున్న రోజుల్లో ఓయూలో పరిస్థితులు, అప్పట్లో చేసిన చిలిపి అలర్లు ఇలా పాత రోజులను గుర్తు చేసుకోవడమేకాదు, క్లాస్ రూమ్ లో పాఠాలు సైతం చెప్పి విద్యార్దుల్లో ఉత్సహాం నింపారు.

ఓయూలో చదువుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా, బిల్డర్ లుగా,రాజకీయ నాయకులుగా ఎదిగివారు సైతం తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి పాత మిత్రులను కలుస్తున్నామనే ఉత్సాహంతో గ్యామ్ మీట్ కు హజరైయ్యారు. సరదా క్రీడలు నిర్వహించడంతోపాటు పలు సామాజిక అంశాలపై చిట్ చాట్ లో పూర్వ విద్యార్దులు పాల్గొన్నారు. చివరి రోజు నిర్వహించిన వీసి ఆవార్డ్స్ కార్యక్రమంలో ఓయూలో ఉన్నత చదువులు పూర్తి చేసి ప్రస్తుతం వివిధి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వీసిలుగా పని చేస్తున్న పూర్వ విద్యార్దులు ఇష్టాగోస్టిలో పాల్గొన్నారు. ప్రస్తుతం విద్యావిధానం, లోపాలతోపాటు పరిష్కార మార్గాలపై సుదీర్గంగా ఈ గ్యామ్ వేదికపై చర్చించారు. యూనిర్సిటీలలో నియామకాల విషయంలో జరుగుతున్న జాప్యం, సమస్య పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు. 

 

ఎస్‌ రామచంద్రమ్, మాజీ విసి ఉస్మానియా యూనివర్సిటీ
ఎస్‌ రామచంద్రమ్, మాజీ విసి ఉస్మానియా యూనివర్సిటీ

అందరూ ఇలా కలవడం సంతోషంగా ఉంది. ఇదే సంప్రదాయం ఇతర యూనివర్సిటీల్లోనూ కొనసాగించాలి. ఓయూ అభివృద్దికి ఆర్థిక సహాయం చేసేందుకు కొందరు పూర్వ విద్యార్ధులు ముందుకు రావడం శుభపరిణామం. భవిష్యత్‌లో గ్యామ్ మీట్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కరూ హాజరయ్యేలా చొరవ తీసుకుంటే మరింత మేలు జరుగుతుంది. నాలుగు దశాబ్దాల తరువాత చదివిన క్లాస్‌లో పాఠాలు చెప్పి ఎంజాయ్ చేయడం బాగుంది. 

ఓయూ గ్యామ్ మీట్ లో ప్రస్తుతం క్యాంపస్ లో ఉన్న సమస్యలపై పూర్వవిద్యార్దులు ప్రత్యేక దృష్టి సారించారు. తమ సొంత డబ్బుతో స్కాలర్ షిప్స్ ఇవ్వడంతోపాటు ఓయూలో విద్యార్దులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమై ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కొందరు తమ వంతు సహాయంగా విళాలు చెక్ ల రూపంలో అందజేశారు. ఓయూ ఉన్నతికి అవసరమైన అంశాలపై చర్చించి 8 ఎంఓయూలపై సంకతాలు చేసారు. ఇలా ఒకటేమిటి నలభై ఏళ్ల తరువాత ఒక్కటైన ఓయూ విద్యార్దులు ఇప్పటి వరకూ చూడని తమ పాత మిత్రులను కలవడంతోపాటు క్యాంపస్ లో తీపి గుర్తులను మరోసారి కళ్లముందు కదిలేలా క్లాస్ రూమ్ లలో సందడి చేసారు.

 

మల్లారెడ్డి, 1984 పీజీ బ్యాచ్
మల్లారెడ్డి, 1984 పీజీ బ్యాచ్

జీవితంలో చివరి దశలో మిత్రులను కలిశాం.. యూనివర్సిటీకి ఏదో చేయాలనే తపన ఉన్నా గతంలో పట్టించుకోలేదు. వివిధ జిల్లాల నుంచి వివిధ రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న మిత్రులను కలవడం మంచి అనుభూతి కలిగిస్తోంది.

మొదటి రోజు ఉత్సాహంగా సాగిన సమావేశం... చివరి రోజు కాస్త ఎమోషన్‌గా నడిచింది. విడిపోతున్నామన్న బాధ అందరిలో కనిపించింది. ఇందులో చాలా మంది అరవై ఏళ్లకు పైబడిన వాళ్లే ఉన్నందున భవిష్యత్‌లో జరిగే మీటింగ్‌లకు వచ్చి స్నేహితులను కలుస్తామో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అందరిలో కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ప్రతి మజిలీ ఎప్పుడో ఒకప్పుడు విడిపోయేదే అనుకొని మళ్లీ అంతా హ్యాపీగా వీడ్కోలు చెప్పుకున్నారు. 



ఎం. వెంకటేశ్వర్లు, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ కమిషనర్‌, 1984 బ్యాచ్
ఎం. వెంకటేశ్వర్లు, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ కమిషనర్‌, 1984 బ్యాచ్

నా స్నేహితులను చాలా కాలం తర్వాత చూడటం ఇదే మొదటిసారి. 30 ఏళ్ల క్రితం చదువుకున్నవాళ్లు వస్తారంటే ముందుగానే వచ్చాం. అంతా కలసి అభివృద్ధికి పాల్పడాలని కోరుకుంటున్నాం.

 

టాప్ హెడ్ లైన్స్

Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Revanth Reddy Love Story: ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
Embed widget