అన్వేషించండి

Nikitha Godishala Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!

Nikitha Godishala Murder Case: అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మ చేతిలో దారుణ హత్యకు గురైన తెలుగు యువతి నిఖిత కేసులో కీలక పురోగతి లభించింది. పరారీలో ఉన్న అర్జున్‌ను ఆగ్రాలో అరెస్టు చేశారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మాజీ ప్రియుడు అర్జున్, నిఖితను ఆర్థిక వివాదంతో అమెరికాలో హత్యచేశాడు.
  • అర్జున్ హత్య చేసి పారిపోగా, ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్.
  • తెలంగాణ పోలీసులు అర్జున్‌ను ఆగ్రాలో అరెస్టు; అమెరికాకు అప్పగింత.

Nikitha Godishala Murder Case: అమెరికాలో సాఫ్ట్‌వర్‌ ఇంజినీర్ చేతిలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్‌కు చెందిన తెలుగు యువతి నిఖిత కేసులో అత్యంత కీలక పరిణామ చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న నిందితుడు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మను తెలంగాణ పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో అరెస్టు చేశారు. స్థానిక పోలీసుల సమన్వయంతో జరిపిన ఈ ఆపరేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి చట్టపరమైన చర్యల కోసం న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించగా, భారత్ అమెరికా నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద నిందితుడిని అమెరికా అధికారులకు అప్పగించేందుకు అవసరమైన అధికార ప్రక్రియను హైదరాబాద్‌ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వేగవంతం చేశాయి. 

హత్యకు దారి తీసిన కారణాలు!

హైదరాబాద్‌లోని లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఆనంద్ కుమార్తె నిఖిత ఎంఎస్‌ చదివేందుకు నాలుగేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. అక్కడ నిఖిత, గత నాగులేళ్లుగా అమెరికాలో డేటా, స్ట్రాటజీ అనలిస్ట్‌గా పని చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడాలన్న ఆమె కలను విధి కబళించింది. 

ఈ కేసులో నిందితుడైన అర్జున్ శర్మ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్. అతను నిఖితకు మాజీ ప్రియుడు. అమెరికాలో నిఖిత ఎల్లికాట్ సిటీలో నివసిస్తుండగా, అర్జున్‌ శర్మ మేరీల్యాండ్‌లోని కొలంబియాలో నివసించేవాడు. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా ఆర్థిక పరమైన వివాదాలు నడుస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిఖిత వద్ద అర్జున్ శర్మ అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా నిఖిత అడిగినందుకు ఆమెను హత్య చేశాడని నిఖిత తండ్రి ఆనంద్ ఆరోపించారు. 

డిసెంబర్‌ 31, 2025న తాను తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేస్తానంటూ నిఖితను పిలిచి అర్జున్ శర్మ హత్య చేశాడు. ఆర్థిక వివాదమే ఈ దారుణ హత్యకు కారణమని అమెరికా అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 

అమెరికా నుంచి పలాయనం 

హత్య చేసిన అనంతం నిందితుడు అర్జున్ శర్మ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత, అనగా 2026 జనవి 2న నిఖిత కనిపించడం లేదంటూ తనే స్వయంగా అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలా పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా గట్టుచప్పుడు కాకుండా భారత్‌ వచ్చేశాడు. 

నిఖిత అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ శర్మ హడావుడిగా దేశం విడిచి వెళ్లిపోవడంతో అమెరికా పోలీసులకు బలమైన అనుమానం కలిగింది. దీంతో జనవి 3న మేరీల్యాండ్‌లోని కొలంబియాలో ఉన్న అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కడ నిఖిత మృతదేహం కుళ్లిపోయి స్థితిలో లభ్యమైంది. శరీరంపై ఉన్న కత్తిపోట్ల గాయాలను బట్టి ఆమెను హత్య చేసినట్టు హోవార్డ్‌ కౌంటీ పోలీసులు నిర్దారించారు. ప్రాథమిక విచారణలో డిసెంబర్‌ 31నే ఆమె హత్య జరిగినట్టు నిర్దారించిన అమెరికా పోలీసులు ఈ విషయాన్ని భారత్‌లోని నిఖిత కుటుంబానికి సమాచారం అందించారు. 

హైదరాబాద్‌లో కేసు నమోద- ఇంటర్‌పోల్ ప్రవేశం

అమెరికా పోలీసుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నిఖిత కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన కుమార్తెను అర్జున్ శర్మ మోసం చేసి అప్పుగా తీసుకున్న డబ్బులు అడిగినందుకే కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడని నిఖిత  తండ్రి ఆనంద్‌ హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడు అర్జున్ శర్మపై ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

మరోవైపు నిందితుడు అర్జున్ శర్మ అమెరికా నుంచి తప్పించుకొని భారత్ వచ్చినట్టు గుర్తించిన అమెరికా పోలీసులు భారత్ అధికారులను సంప్రదించారు. అమెరికాలో అతడిపై కేసు ఉండటంతోపాటు నాన్‌-బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్న విషయం గుర్తించారు. దీంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేశారు.

ఆగ్రాలో నిందితుడు అరెస్టు

నిందితుడు అర్జున్ శర్మను పట్టుకోవడానికి హైదరాబాద్ పోలీసు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. నిందితుడు దేశంలో ఎక్కడ ఉన్నాడనే దానిపై దర్యాప్తు చేపట్టి ఆగ్రాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక అపార్ట్‌మెంట్‌లో అర్జున్ శర్మ దాక్కున్నట్టు పోలీసులు సమాచారం సేకరించారు. హైదరాబాద్‌ పోలీస్ ప్రత్యేక బృందం ఆగ్రాకు చేరుకొని, స్థానిక పోలీసుల సహకారంతో అర్జున్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో నమోదైన మోసం కేసుకు సంబంధించి మొదట అతడికి నోటీసులు జారీ చేశారు. ఆపై కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో తదుపరి చర్యలు చేపట్టామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. 

అమెరికాకు అప్పగించే దిశగా చర్యలు 

ఆగ్రాలో అరెస్టు అయిన అర్జున్ శర్మను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్‌కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం నిందితుడు అర్జున్ శర్మను అమెరికాకు తరలించే ప్రక్రియ ఊపందుకుంది. అమెరికా-భారత్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద నిందితుడిని అమెరికా అధికారులకు అప్పగించానికి తదుపరి చట్టపరైన చర్యలను హైదరాబాద్‌ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వేగవంతం చేశాయి.   

Frequently Asked Questions

అమెరికాలో హత్యకు గురైన తెలుగు యువతి ఎవరు? నిందితుడు ఎవరు?

హైదరాబాద్‌కు చెందిన నిఖిత అనే తెలుగు యువతి అమెరికాలో హత్యకు గురైంది. ఆమె మాజీ ప్రియుడు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మ నిందితుడు.

ఈ హత్యకు గల కారణాలు ఏమిటి?

నిఖిత, అర్జున్ శర్మ మధ్య ఆర్థిక వివాదాలున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకే నిఖితను హత్య చేశాడని ఆమె తండ్రి ఆరోపించారు.

నిందితుడు అర్జున్ శర్మను ఎక్కడ అరెస్టు చేశారు?

నిందితుడు అర్జున్ శర్మను ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో తెలంగాణ పోలీసులు స్థానిక పోలీసుల సమన్వయంతో అరెస్టు చేశారు. హత్య జరిగిన తర్వాత అతను అమెరికా నుంచి భారత్‌కు పారిపోయాడు.

నిందితుడు అర్జున్ శర్మకు సంబంధించిన ప్రస్తుత న్యాయ ప్రక్రియ ఏమిటి?

అతడిని న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. భారత్-అమెరికా నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద అమెరికాకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 34 నెలల నుంచి కంటి నిండా నిద్రలేదు, ఫ్యామిలీని సైతం పట్టించుకుంటలేను: సీఎం రేవంత్‌రెడ్డి
34 నెలల నుంచి కంటి నిండా నిద్రలేదు, ఫ్యామిలీని సైతం పట్టించుకుంటలేను: సీఎం రేవంత్‌రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్ షాపులో పేలుళ్లతో కలకలం! భద్రతపై ప్రశ్నలు
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్ షాపులో పేలుళ్లతో కలకలం! భద్రతపై ప్రశ్నలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget