అన్వేషించండి

Mega Dairy Project: పాడి రంగంలో మెగా ప్రాజెక్టు, రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

Mega Dairy Project: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో నిర్మించిన మెగా ప్రాజెక్టును రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

Mega Dairy Project: రాష్ట్రంలో పాడిరంగంలో భారీ ప్రాజెక్టు సిద్ధమైంది. మెగా డెయిరీని సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మెగా డెయిరీలో రోజుకు 8 లక్షల లీటర్ల పాలను శుద్ధి చేయడంతో పాటు 10 టన్నుల నెయ్యి, 10 వేల లీటర్ల ఐస్‌క్రీం తయారీ సామర్థ్యంతో దీనిని నిర్మించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో నిర్మించిన ఈ భారీ ప్లాంటును ఈ నెల 5వ తేదీన రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దేశంలోనే ప్రభుత్వరంగంలో అతి పెద్ద డెయిరీ ప్లాంటు అయిన ఇది రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి, రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, భారీ ఎగుమతులు వంటి బృహత్తర లక్ష్యాలతో దీనిని నిర్మించారు.

తెలంగాణ రాష్ట్రంలో రోజూ ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) ద్వారా 1.30 లక్షల మంది రైతుల నుంచి 4 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. మరింత ఎక్కువ పరిమాణంలో పాలను విక్రయించేందుకు రైతులు ముందుకు వచ్చేలా శుద్ధి సామర్థ్యం లేకపోవడంతో ఎక్కువ మొత్తంలో పాలను సేకరించడం లేదు. ఈ క్రమంలోనే నాలుగు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల సేకరణ, ఉత్పత్తులను భారీగా పెంచేందుకు మెగా డెయిరీ ప్రతిపాదన వచ్చింది. ఈ మేరకు దేశంలోని వివిధ డెయిరీలను అధ్యయనం చేసిన తర్వాత ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. 

ఈ మెగా ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 240 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి రాష్ట్ర సర్కారు రూ.75 కోట్లు గ్రాంటుగా ఇచ్చింది. అలాగే ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య రూ. 26 కోట్లు సమకూర్చింది. మరో రూ.146 కోట్లను జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య నుంచి రుణంగా తీసుకున్నారు. రెండు సంవత్సరాల కాలంలో ఈ భారీ డెయిరీ నిర్మాణం పూర్తయింది. ఇందులో 300 మంది సిబ్బంది నిత్యం విధులు నిర్వర్తిస్తారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి లభిస్తుంది. 

దేశంలోనే అత్యాధునిక, పూర్తి స్థాయి ఆటోమేషన్ ప్రాసెసింగ్ యంత్రాలను ఈ మెగా డెయిరీలో అమర్చారు. యంత్రాల ద్వారా శుద్ధితో అత్యంత నాణ్యమైన పాలు తయారు అవుతాయి. అలాగే పోషక విలువలు యథాతథంగా ఉంటాయి. డెయిరీని సౌర విద్యుత్ తో అనుసంధానం చేశారు. డెయిరీ నుంచి వచ్చే వ్యర్థాల ద్వారా ఇంధనాన్ని తయారు చేసే ఏర్పాట్లు కూడా చేశారు. 

ఈ మెగా డెయిరీ ద్వారా దాదాపు 5 లక్షల మంది పాడి రైతుల నుంచి పాలను సేకరించనున్నారు. దీంతో పాటు.. విజయ డెయిరీ, దాని అనుబంధ జోనల్ కార్యాలయాల్లో రోజుకు మొత్తం 12 లక్షల లీటర్ల పాలను సేకరిస్తారు. పాల సేకరణ పెంపుదల కోసం ప్రభుత్వం సబ్సిడీపై గేదెలు, ఆవులను సరఫరా చేయనుంది. మెగా డెయిరీ ప్రారంభం దృష్ట్యా ప్రభుత్వ రంగంలో పాడి ఉత్పత్తులను విజయ డెయిరీ ద్వారా విక్రయించేందుకు వీలుగా కొత్త దుకాణాలను ప్రారంభిస్తారు. అంగన్ వాడీ కేంద్రాలతో పాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు పాల సరఫరా ప్రాజెక్టులను సైతం విజయ డెయిరీ చేపట్టనుంది.

టాప్ హెడ్ లైన్స్

Lafoot Gang Producer : 2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Shubman Gill Reclaims No1 ODI Rank: వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. Rankingsలో భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
Embed widget