By: ABP Desam | Updated at : 10 Apr 2023 11:50 PM (IST)
Edited By: Shankard
మహారాష్ట్ర బిఆర్ఎస్ లో కొనసాగుతున్న చేరికల పర్వం
- మహారాష్ట్ర బిఆర్ఎస్ లో కొనసాగుతున్న చేరికల పర్వం.
సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న ఎన్సీపి రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ సలుంఖే , మాజీ ఎమ్మెల్యే సంగీత వి థోంబరే భర్త విజయ్ థోంబరే తదితరులు.
భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లో చేరికల పర్వం కొనసాగుతోoది. బిఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులతో బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతొంది . ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకులు శంకర్న ధోంగే నేతృత్వంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు సోమవారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో గులాబి కండువాలు కప్పుకొని బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో ఎన్సీపి రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ సలుంఖే , మాజీ ఎమ్మెల్యే సంగీత వి థోంబరే గారి భర్త విజయ్ థోంబరే, ముఖేడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నానాసాహెబ్ జాదవ్, జెడ్పీ మెంబర్ శివ మొహోద్, మాజీ సభాపతి సుశీల్ ఘోటె, మాజీ జెడ్పీ మెంబర్ దేవానంద్ మూలె, నాందేడ్ కార్పోరేటర్ శ్రీనివాస్ జాదవ్, శివ్ సంగ్రామ్ పార్టీ నుండి కచ్రే సహేద్, ఎ బీడ్ నుండి అమర్ షిండే, పిఎంసి మొతాలా జిల్లా బుల్ధానా ప్రెసిడెంట్, శివ్ సంగ్రామ్ పార్టీ ప్రెసిడెంట్ పంజాబ్ రావ్ దేశ్ ముఖ్, శివ్ సంగ్రామ్ పార్టీ స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ శైలేష్ సర్కేట్, ఎంఎన్ఎస్ లాతూర్ జిల్లా ప్రెసిడెంట్ ద్నీనేశ్వర్ జగ్డేల్, బీడ్ జిల్లా - శివ్ సంగ్రామ్ పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ అర్సుల్, శివ్ సంగ్రామ్ పార్టీ స్టూడెంట్ వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కమలాకర్ థోరట్, బీడ్ జిల్లా – బిజెపి వైస్ ప్రెసిడెంట్ దీపక్ షిండే, లాతూర్ జిల్లా తాలూకా ఎన్సీపి ప్రెసిడెంట్ ఆదిత్య దేశ్ ముఖ్, బీడ్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ సోమవంశీ, లాతూర్ జెడ్పీ మెంబర్ వ్యంకట్రావ్ జాదవ్, ధరూర్ జిల్లా బీడ్ తాలూకా బిజెపి ప్రెసిడెంట్ మహేష్ సోలంకె, బీడ్ జిల్లా అంబజోగయ్ తాలూకా భావ్ థానా సర్పంచ్ శివ్ లింగ్ యాదవ్, సామాజిక కార్యకర్తలు ఇంద్రజిత్ మోరే, ధనంజయ్ మసాల్, సిద్ధేశ్వర్ థోనగే తదితరులు నాయకులున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు శివరాజ్ ధోంగే తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు
తన జీవితమంతా పోరాటాలతోనే గడుస్తోందని, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రైతుల కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నానని తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు దాదాపుగా తగ్గిపోయాయని, దేశమంతా ఇదే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్సమక్షంలో మహారాష్ట్రకు చెందిన రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రైతు సంఘాల నేతలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రైతుల పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు కేసీఆర్. అన్నదాతల పోరాటంతో మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు శరత్ జోషి, ప్రణీత్ సహా తదితరులకు కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. తన రాజకీయ జీవితమంతా పోరాటాలతోనే గడిచిపోయిందన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం కోసం కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నామన్న కేసీఆర్.. ఇప్పుడు సీఎంగా ఉన్నా రైతుల కోసం ఢిల్లీలో పోరాటాలు చేస్తున్నామని గుర్తుచేశారు. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలు దిగొస్తాయని, అందుకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు సాగు చట్టాలే నిదర్శనం అన్నారు కేసీఆర్.
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత
TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథమిక కీ విడుదల! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!