అన్వేషించండి

KCR Undavalli Meet: ఉండవల్లి అరుణ్ కుమార్‌తోనూ కేసీఆర్ భేటీ, ఈ వరుస సమావేశాలు అందుకోసమేనా?

Undavalli Arun Kumar: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అనంతరం కేసీఆర్ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయ్యారు.

KCR Meets Undavalli Arun Kumar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే (జూన్ 12) ఆయనతో సమావేశం ముగిసింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అనంతరం వీరిద్దరి భేటీ జరిగింది. జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ తో జాతీయ పార్టీ అంశంపై చర్చించేందుకే ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లుగా సమాచారం. కొత్త పార్టీ పెడితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందనే కోణంలో కేసీఆర్ ఆయన అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమతో ఏ పార్టీలు కలిసొచ్చే అవకాశం ఉంటుందనే అంశంపై కూడా కేసీఆర్ ఉండవల్లి సలహాలు తీసుకున్నట్లుగా సమాచారం.

KCR PK Meet: అంతకుముందు పీకేతో
ఉండవల్లితో సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. మూడు గంటలుగా వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు. జాతీయ పార్టీ ప్రకటన, ఎన్నికలు, సర్వే తదితర కీలక అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు సమాచారం. ఇటీవల ఎమ్మెల్యేల పనితీరుపై పీకే సర్వే చేశారు. పార్టీని దేశవ్యాప్తంగా ఎలా విస్తరించాలి? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి వ్యూహాలు రచించాలనే అంశంపై వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది.

ప్రగతి భవన్‌లో ఈనెల 10వ తేదీన (శుక్రవారం) మంత్రులు, ఎంపీలు, కీలక నేతలతో కేసీఆర్ 6 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో కేసీఆర్‌ దేశ రాజకీయ పరిస్థితులు, అందులో టీఆర్‌ఎస్‌ పోషించనున్న పాత్రపై విస్తృతంగా చర్చించినట్లుగా తెలిసింది. దేశంలో మతపరమైన పరిస్థితులు నెలకొన్న వేళ దేశ ప్రజల అవసరాలు ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దామని కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం. టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చే అంశంపై వారి అభిప్రాయాలు సేకరించినట్లుగా తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పీకేతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీఆర్‌ఎస్‌ త్వరలోనే భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మారబోతోందా? అనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే, ఈ నెల 19లోగా జరుగనున్న టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశంలో దీనిపై సీఎం కేసీఆర్‌ ఫైనల్ నిర్ణయం ప్రకటించనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎప్పట్లాగే కొనసాగుతుందా? లేదా ఊహాగానాలకు తగ్గట్లుగా జాతీయ పార్టీగా అవతరిస్తుందా అనే అంశంపై ఆసక్తి నెలకొని ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget