Hyderabad Rains: హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం, పలుచోట్ల ట్రాఫిక్ సమస్య- నగర వాసులకు జీహెచ్ఎంసీ అలర్ట్
Hyderabad Rains ALERT: హైదరాబాద్ నగరంలో పలు ఏరియాలలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది.
Hyderabad Rains ALERT: హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం మొదలైంది. గత మూడు రోజులుగా వర్షాలు అంతగా లేకపోవడంతో వీకెండ్ లో ఔటింగ్ కు వెళ్లిన నగరవాసులు వర్షంలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. నగరంలోని పలు ఏరియాలలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, బాలానగర్, మియాపూర్, నిజాంపేట, ప్రగతినగర్, మణికొండ, ఖైరతాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గంలో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మేడ్చల్, కొంపల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ప్రాంతాల్లోనూ వర్షం దంచి కొడుతోంది.
జగద్గిరిగుట్ట, సూరారం కాలనీ, హఫీజ్ పేట, ఆర్సీ పురం, అల్వాల్, చర్లపల్లి సహా మరిన్ని ఏరియాలలో వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో కొన్ని జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరుతోంది. నగరంలో పలు ఏరియాలలో మళ్లీ వాన మొదలుకావడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది, డీఆర్ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని ఏరియాలలో సోమవారం ఉదయం వరకు మోస్తరు వాన పడే అవకాశం ఉందని అధికారులు నగర వాసులను అలర్ట్ చేశారు.
#30JULY 8:40PM⚠️
— Hyderabad Rains (@Hyderabadrains) July 30, 2023
HEAVY THUNDERSTORMS moving Away towards Bhongiri ,Without much Effect to the City.
Light -Moderate Rains to Continue in North& Central #Hyderabad for Next 1Hr🌧️#HyderabadRains pic.twitter.com/6TEn7462Fd
రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడాక్కడా ఎల్లుండి చాలా చోట్ల, కురిసే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికల్లాంటివి ఏమీ జారీ చేయలేదు. ఆగస్టు 1న మాత్రం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిరర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా్లలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి ఉండటంతో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ శనివారం తెలిపింది గత రెండు మూడు రోజులుగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు దిగి రానున్నాయి. . ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 82 శాతంగా నమోదైంది.
HyderabadRains ALERT ⚠️
— Telangana Weatherman (@balaji25_t) July 30, 2023
A huge thunderstorm with severe winds and thunderbolts crawling into North Hyderabad. Especially black marked areas can get powerful spell of rain next 1hr. Outside areas of black circle too need to watch for some rains but not severe#HyderabadRains pic.twitter.com/x5c4ABd1vR
3 రోజులు వర్షాలే..!
తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం, మంగళవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురనుండగా.. మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని అంచనా వేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial