అన్వేషించండి

హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ

ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ Ebola Virus హైదరాబాద్‌లో కలకలం రేపింది. గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేరిన ఇద్దరు సూడాన్ పౌరుల్లో ఒకరికి నెగటివ్ రాగా.. రెండో కేసుపై ఉత్కంఠ నెలకొంది

Ebola Tension in Hyderabad: ఎబోలా వైరస్ భయంతో హైదరాబాద్‌లో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. ఇప్పటికే చాలా దేశాలను వైరస్ వణికిస్తోంది. అయితే ఒక్కసారిగా ఇక్కడ రెండు అనుమానిత కేసులు రావడంతో వైద్య వర్గాల్లో కంగారు మొదలైంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు అనుమానితులను గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అయితే అందులో ఒకరికి ఎబోలా నెగెటివ్ అని తేలడంతో వైద్యారోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారికంగా ధృవీకరించారు.

హైదరాబాద్‌లో రెండు ఎబోలా అనుమానిత కేసులు

గురువారం హైదరాబాద్‌లో రెండు ఎబోలా అనుమానిత కేసులు రావడంతో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం కనిపించింది. గాంధీ ఆసుపత్రికి ఎబోలా లక్షణాలు ఉన్న ఇద్దరిని తీసుకొచ్చారు. వీరిలో ఒకరు  మోకాళ్ళ సర్జరీ కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఒక 35 ఏళ్ల సూడాన్ పౌరుడు. ఇథియోపియా నుంచి వచ్చిన విమానంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతనికి ఉగాండా, సౌత్ సూడాన్ వంటి ఎబోలా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ట్రావెల్ హిస్టరీ ఉంది. 

ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ చేస్తుండగా అతనికి తీవ్రమైన జ్వరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఎబోలా లక్షణాలుగా అనుమానించి, తక్షణమే అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అనంతరం అతని రక్త నమూనాలను సేకరించి పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి పంపగా, ఆ రిపోర్టులో ఎబోలా లేదని (నెగెటివ్) తేలింది. నెగటివ్ వచ్చినప్పటికీ ఆ వ్యక్తిని ఇంకా డిస్చార్జ్‌ చేయలేదు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC గైడ్‌లైన్స్‌ ప్రకారం ఇంకా మానిటర్ చేస్తున్నామని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 

రెండో కేసుపై పెరుగుతున్న ఉత్కంఠ!

మొదటి వ్యక్తికి నెగెటివ్ వచ్చినప్పటికీ, గురువారం సాయంత్రం ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మరో 20 ఏళ్ల సూడాన్ విద్యార్థిని కూడా ఎబోలా లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇతని నమూనాలను కూడా పూణెకు పంపించారు. శనివారం (జూన్6)దీనికి సంబంధించిన ఫలితం రానుంది. 


అప్రమత్తమైన ఆరోగ్య శాఖ: ఎయిర్‌పోర్టులో కఠిన నిబంధనలు

రెండు అనుమానిత కేసులు రావడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆఫ్రికన్ దేశాల్లో ఎబోలా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణీకులకు కఠినంగా హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌కు వైద్య సేవల కోసం ఎక్కువుగా ఆఫ్రికా దేశాల నుంచి రోగులు వస్తుంటారు. వీరంతా ఎక్కువుగా ఎబోలా ప్రభావిత దేశాల గుండా ట్రావెల్ చేసేవారే. అంతే కాకుండా నగరంలోని వివిధ విద్యాసంస్థల్లో కూడా ఆఫ్రికన్ దేశస్తులు ఉన్నారు. వీరందరినీ కఠినంగా పరిశీలిస్తున్నారు.  ఉగాండా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు విమానం దిగడానికి ముందే సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్ (SDF) సమర్పించాల్సి ఉంటుంది. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చి, ఎటువంటి లక్షణాలు లేని ప్రయాణీకులను కూడా ముందస్తు జాగ్రత్తగా 21 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో Home Isolation  ఉంచి వారి ఆరోగ్యాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఎబోలా వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది?
 
ఎబోలా ప్రాణాంతకమైన వైరస్. ఇది గబ్బిలాలు, కోతుల ద్వారా మనుషులకువస్తుంది. ఆ తర్వాత సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం లేదా శరీర ద్రవాలను నేరుగా తాకడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది.


లక్షణాలు: హఠాత్తుగా తీవ్రమైన జ్వరం, నీరసం, కండరాల నొప్పులు. తీవ్రత పెరిగితే అంతర్గత, బాహ్య రక్తస్రావం (Bleeding), ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటివి జరుగుతాయి.
మరణాల రేటు: ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం చాలా ఎక్కవ

హైదరాబాద్ నగర ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విదేశాల నుంచి వచ్చే వారిపై నిరంతరం నిఘా ఉంచామని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
Bandi Bhagirath Bail: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు ఊరట! పోక్సో కేసులో బెయిల్!
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు ఊరట! పోక్సో కేసులో బెయిల్!
Rainbow Hospital: ఐదో అంతస్తు నుంచి పడిన బాలుడికి పునర్జనమ్మ! క్లిష్టమైన చికిత్స చేసి ప్రాణం పోసిన రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు! 
ఐదో అంతస్తు నుంచి పడిన బాలుడికి పునర్జనమ్మ! క్లిష్టమైన చికిత్స చేసి ప్రాణం పోసిన రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు! 
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget