అన్వేషించండి

Tamilisai: కొలిక్కి వచ్చిన గవర్నర్ తమిళిసై ట్విట్టర్ హ్యాక్ కేసు, 3 ఐపీ అడ్రస్ లు గుర్తింపు

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఎక్స్‌   అకౌంట్ హ్యాక్ కేసులో సైబర్ పోలీసులు కొలిక్కి తీసుకువచ్చారు.

Governer X Account Hacking Case : తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ (Tamil Sye Soundarrajan ) ఎక్స్‌   అకౌంట్ హ్యాక్ కేసులో సైబర్ పోలీసులు కొలిక్కి తీసుకువచ్చారు. మన దేశంలోనే మూడు ఐపీ అడ్రస్‌ల నుంచి ఆపరేట్‌ అయినట్టు తెలంగాణ పోలీసులు (Telangana Police) గుర్తించారు. ఐపీ అడ్రస్‌ల వివరాలు పంపాలంటూ...టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల (Service Providers ) కు లేఖలు రాశారు.  హాత్‌వే, యాక్ట్‌ సహా మరో ఇంటర్నెట్‌ సర్వీసు ద్వారా గవర్నర్‌ ఖాతాను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది. వివరాలు వచ్చిన తర్వాత నిందితులను పట్టుకుంటామని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెల్లడించారు. 

గవర్నర్ కు సంబంధం లేని పోస్టులు

కంపెనీ నియమ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎక్స్​ కంపెనీ నుంచి గవర్నర్​ తమిళి సైకి మెయిల్ వచ్చినట్లు సమచారం. గవర్నర్ తన అకౌంట్​ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. పాస్‌వర్డ్ తప్పంటూ జవాబు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తమిళిసైకి సంబంధంలేని పోస్టులు పెట్టారు. గవర్నర్ తమిళిసై ఆదేశాలతో రాజ్​భవన్​ అధికారులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  గవర్నర్ ఎక్స్​ అకౌంట్​ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మొన్న మంత్రి దామోదర...నిన్న ఎమ్మెల్సీ కవిత
ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాంకింగ్ కు గురయ్యాయి. మంత్రి రాజనర్సింహా సోషల్ మీడియా అకౌంట్ ను...సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంత్రికి సంబంధం లేని బీజేపీ, టీడీపీ, తమిళనాడుకు చెందిన పలు రాజకీయ పార్టీల ఫొటోలను పోస్టు చేయడం దుమారం రేపింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...సోషల్ మీడియా ఖతాలను హ్యాక్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి పాస్‌వర్డ్ మార్చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ఇటీవలే కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎక్స్ సహా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను హ్యాక్‌ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డీసీపీ, సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ట్యాగ్ చేస్తూ కవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోగి చొరబడి...సంబంధం లేని వీడియోను పోస్టు చేసినట్టు వెల్లడించారు. 

గతంలో ప్రధానితో పాటు సెలబ్రెటీల ఖాతాలు హ్యాక్
గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విటర్ ఖాతాను దుండగులు హ్యాక్ చేసినట్లు గుర్తించారు. కేంద్ర మంత్రుల ఖాతాలు, వివిధ ప్రభుత్వ ఖాతాలు, మంత్రుల ఖాతాలు హ్యాక్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిల్లలు, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాక్ చేశారు. వారికి సంబంధం లేకుండా పోస్టులను...సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు. ఆ తర్వాత బాధితులంతా తమ ఖాతా హ్యాక్ అయిందంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. గతంలో విదేశాంగ శాఖలోని విదేశీ వ్యవహారాల విభాగం ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలను హ్యాకర్లు పట్టుకుంటున్నట్లు సమాచారం.  ట్విటర్, వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సామాజిక మాధ్యమ వేదికలు జనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరు ఒకటికి మించి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు ఈజీగా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduates MLC Election: ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6.. పట్టభద్రుల ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్!
ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6.. పట్టభద్రుల ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్!
PDS Rice Recycling: సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?
Medical Seats Vacant: ఫీజుల భయం.. తెలంగాణలో భారీగా మిగిలిపోయిన ఎంబీబీఎస్ సీట్లు
ఫీజుల భయం.. తెలంగాణలో భారీగా మిగిలిపోయిన ఎంబీబీఎస్ సీట్లు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Prakasam Boat Capsized Dead Bodies: కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
Ramayana Collection : రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
Congress High Command: కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Shaving Tips for Men : మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
Embed widget