అన్వేషించండి

జీహెచ్‌ఎంసీలో నూతన అధ్యాయం.. 3 కార్పొరేషన్లుగా GHMC, ఏ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందంటే..

తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లుగా విభజించింది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిపాలనలో బుధవారం ఒక చారిత్రక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకు జిహెచ్ఎంసి (GHMC) పరిధిలో ఉన్న ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విభజించింది. గతంలో ఉన్న 150 డివిజన్లు పునర్విభజన అనంతరం 243 స్థానాలకు పెరిగాయి. శివారు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల విలీనంతో మరో 57 డివిజన్లు అదనంగా చేరాయి. ఇలా మొత్తం 300 డివిజన్లతో విస్తరించిన మహా నగరాన్ని పరిపాలన సౌలభ్యం కోసం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంతో ప్రభుత్వం మూడు కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లుగా విడగొట్టింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసి చట్టం-1955లోని సెక్షన్-3(1) ప్రకారం అధికారిక గెజిట్ విడుదల కావడంతో బుధవారం నుంచి నూతన కార్పొరేషన్లు విడివిడిగా కార్యకలాపాలు ప్రారంభించాయి

పరిపాలనా సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్ మహానగర పరిధిలోని కీలక మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త కమిషనర్లు నియమితులయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్‌గా ఆర్.వి. కర్ణన్ బాధ్యతలు స్వీకరించగా, ఐటీ కారిడార్‌తో కూడిన కీలకమైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలను జి. సృజన చేపట్టారు. మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా టి. వినయ్ కృష్ణారెడ్డి విధుల్లో చేరారు.

ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు ఉన్న 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతం (TCUR) గా ప్రభుత్వం గుర్తించింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో 2024 సెప్టెంబరులో 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఆ తర్వాత 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలను కూడా జిహెచ్ఎంసిలో కలిపారు. ఈ విలీనాల అనంతరం డివిజన్ల పునర్విభజన పూర్తి చేసి నగరాన్ని 300 డివిజన్లుగా, 60 సర్కిళ్లుగా, 12 జోన్లుగా వర్గీకరించారు. ఫిబ్రవరి 10, 2026 నాటికి పాత పాలకమండలి గడువు ముగియడంతో వెంటనే ఈ విభజన ప్రక్రియ అమల్లోకి వచ్చింది.


జీహెచ్‌ఎంసీలో నూతన అధ్యాయం.. 3 కార్పొరేషన్లుగా GHMC, ఏ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందంటే..

నూతనంగా ఏర్పడిన ఈ 3 కార్పొరేషన్ల ద్వారా స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం కానుంది. పౌర సేవలు ప్రజలకు మరింత చేరువ చేయడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనలో స్పష్టత తీసుకురావడానికి ఈ విభజన దోహదపడుతుంది. ఒక్కో కార్పొరేషన్ తన పరిధిలోని నిధులను, వనరులను స్వయంప్రతిపత్తితో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమబద్ధీకరణ ద్వారా హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

3 కార్పొరేషన్లుగా GHMC .. ఏ ప్రాంతం ఏ పరిధిలోకి

సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(CMC)

పాత జీహెచ్‌ఎంసీలోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లకు... విలీనమైన మణికొండ, నార్సింగి, తెల్లాపూర్, అమీన్‌పూర్, బొల్లారం, నిజాంపేట్, దుండిగల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ పట్టణ స్థానిక సంస్థలు కలిశాయి. కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లతో సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(CMC) ఏర్పాటు చేశారు.

శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాలు పూర్తిగా, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, మేడ్చల్, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి.

మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌(MMC)
   
పాత జీహెచ్‌ఎంసీలోని సికింద్రాబాద్‌, ఎల్బీనగర్ జోన్లు పాక్షికంగా... విలీనమైన బోడుప్పల్, ఫీర్జాదిగూడ, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, ఘట్‌కేసర్, జవహర్‌నగర్, తూముకుంట యూఎల్‌బీలతో మల్కాజిగిరి, ఎల్బీనగర్‌, ఉప్పల్ జోన్లు అయ్యాయి. వాటితో మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌(MMC) ఏర్పాటు చేశారు.

మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గాలు పూర్తిగా, మేడ్చల్, కూకట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలు పాక్షికంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కిందకు వచ్చాయి.  

జీహెచ్‌ఎంసీ..

పాత గ్రేటర్‌ పరిధిలోని ఖైరతాబాద్, చార్మినార్‌ జోన్లు.. సికింద్రాబాద్, ఎల్బీనగర్‌ జోన్లలోని కొన్ని ప్రాంతాలు, శంషాబాద్, జల్‌పల్లి, బండ్లగూడజాగీర్, బడంగ్‌పేట్, తుక్కుగూడ, ఆదిభట్ల, మీర్‌పేట్, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట యూఎల్‌బీలతో ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్,గోల్కొండ, శంషాబాద్, రాజేంద్రనగర్‌ జోన్లు అయ్యాయి. వాటితో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేశారు.

ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, మలక్‌పేట్, అంబర్‌పేట, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలు పూర్తిగా, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget