(Source: ECI/ABP News/ABP Majha)
Falaknuma Express Accident: ఫలక్‌నుమా రైలు ప్రమాదంతో పలు రైళ్లు రద్దు - క్షేమంగా ఇంటికి చేరిన బాధితులు
Falaknuma Express Accident: యాదాద్రి భువనరిగి జిల్లాలో జరిగిన ఫలక్ నుమా రైలు ప్రమాదంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.
Falaknuma Express Accident: హోరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు నేటి మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన అధికారులు వెంనే స్పందించి చైన్ లాగడంతో ప్రయాణికులంతా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. యాదాద్రి జిల్లాలో బొమ్మాయిపల్లి పగిడిపల్లి మధ్య ప్రమాదం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎస్3, ఎస్4, ఎస్5, ఎస్6 బోగీల్లో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని వెంటనే గ్రహించిన అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఇలా ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ప్రమాదం కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Due to the fire incident of Train No. 12703 Howrah – Secunderabad the following trains are cancelled / partially cancelled / diverted as detailed below@drmsecunderabad @drmgnt pic.twitter.com/LuMZd0U6nx
— South Central Railway (@SCRailwayIndia) July 7, 2023
సికింద్రాబాద్ - రేపల్లె, సికింద్రాబాద్ - మన్మాడ్ వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేశారు. తిరువనంతపురం - సికింద్రాబాద్, రేపల్లె - సికింద్రాబాద్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. సికింద్రాబాద్ - తిరువనంతపురం, సికింద్రాబాద్ - హౌరా, విశాఖపట్నం - లింగంపల్లి, నర్సాపూర్ -నాగర్ సోల్ రైళ్లను దారి మళ్లించారు.
Passengers of Train No. 12703 (Howrah - Secundrabad) is being transported safely by arranging 12 buses to Secunderabad. @RailMinIndia @drmsecunderabad pic.twitter.com/OEIACmsIk4
— South Central Railway (@SCRailwayIndia) July 7, 2023
ప్రమాదం జరిగిన రైల్లోని ప్రయాణికుల కోసం ఘటనా స్థలం నుంచి రైల్వే అధికారులు ప్రత్యేకంగా 12 బస్సులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రయాణికులను సికింద్రాబాద్ పంపించారు. అక్కడి నుంచి వారి వారి ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హెల్స్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన రైల్లో వచ్చిన ప్రయాణికుల గురించి, వారి బోగుగుల గురించి తెలుసుకునేందుకు 040-27786140, 86170, బీఎసఎన్ఎల్ - 040-27801111 నంబర్లకు ఫోన్ చేయాలని వివరించారు.
Help Desk has been provided at Secundrabad Railway station
— South Central Railway (@SCRailwayIndia) July 7, 2023
SC helpline No.04027786140, 86170, BSNL-040 27801111 @drmsecunderabad @RailMinIndia pic.twitter.com/TlEvrDTMDp
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మొత్తం ఆరు బోగీలు దగ్ధమయ్యాయి. ఎస్-4, ఎస్-5, ఎస్-6, ఎస్-7 బోగీలు కాలి బూడిదయ్యాయి. బోగీల్లో పొగ గమనించగానే లోకో పైలెట్ ట్రైన్‌ను నిలిపివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులంతా రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. అగ్నిప్రమాదానికి గురైన బోగీలను రైలు నుంచి విడదీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్యలో రైలు సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఓ వ్యక్తి అప్రమత్తమై చైన్ లాగాడు. దీంతో ప్రయాణికులంతా హుటాహుటిన రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. మంటల్లో ఆరు బోగీలు పూర్తిగా తగులబడిపోయాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial