అన్వేషించండి

BJP Office: ‘సాలు దొర - సెలవు దొర’ తెర మళ్లీ ఏర్పాటు, దుమారం రేపిన డిజిటల్ కౌంట్ డౌన్‌ బోర్డు

జీహెచ్ఎంసీ కూడా ఈ డిజిటల్ బోర్డుపైన అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులు తొలగించాలని చెప్పడంతో బీజేపీ నేతలు ఈ బోర్డును తీసేశారు.

బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదాలతో పాటు ఫ్లెక్సీలు, డిజిటల్ బోర్డుల రూపంలో విమర్శల హడావుడి కొనసాగుతూనే ఉంది. కొద్ది వారాల క్రితం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు సాలు దొర.. సెలవు దొర, సాలు దొర.. సంపకు దొర అంటూ డిజిటల్ బోర్డులు ఏర్పాటైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బీజేపీ ఆఫీసు ముందు సెలవు దొర డిజిటల్ బోర్డు మళ్లీ కనిపించింది. ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సూచిస్తూ దీన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ గతంలో కౌంట్ డౌన్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్​ బోర్డుపై టీఆర్ఎస్ నేతల నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు వచ్చి తీవ్ర దుమారంగా మారింది. 

ఆఖరికి జీహెచ్ఎంసీ కూడా ఈ డిజిటల్ బోర్డుపైన అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులు తొలగించాలని చెప్పడంతో బీజేపీ నేతలు ఈ బోర్డును తీసేశారు. తాజాగా మళ్లీ ఆ డిజిటల్ బోర్డును పెట్టారు. కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీజేపీ రాష్ట్ర నేతలు, మళ్లీ పార్టీ కార్యాలయం అవరణలో 'సాలు దొర సెలవు దొర' డిజిటల్ బోర్డును పెట్టారు. సీఎం కేసీఆర్ గద్దె దిగే వరకు ఈ కౌంట్ డౌన్ బోర్డు కొనసాగుతుందని పార్టీ నేతలు గతంలోనే చెప్పారు.

ఫ్లెక్సీల వార్ కూడా
ఇప్పుడు ఫ్లెక్సీల వార్ కూడా ఇలాగే నడుస్తోంది. తాజాగా ఇది రాజేంద్రనగర్ లో కనిపించింది. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో వినూత్నంగా హోర్డింగ్స్‌ వెలిశాయి. అభివృద్ధిలో ఎవరి వాటా ఎంత? కేంద్రం ఇచ్చిన నిధులెన్ని? రాష్ట్రం ఇచ్చిన సొమ్మెంత? ప్రజలారా ఆలోచించండి అంటూ స్థానిక బీజేపీ నాయకులు హోర్డింగులు పెట్టారు. సొమ్మొకరిది - సోకొకరిది అనే సినిమా టైటిల్ పేరుతో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అంతటా పోస్టర్లు అంటించారు. ఏకంగా హైవేలపై భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు. 

రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి. రాజేంద్రనగర్‌ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినది ఎంత? అంటూ లెక్కలతో సహా భారీ హోర్డింగ్స్‌ పెట్టారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.44 కోట్ల 26 లక్షల రూపాయలు ఇచ్చిందని ఫ్లెక్సీలపై రాశారు. రాష్ట్రం కేవలం రూ.25 కోట్లు మాత్రమే కేటాయించిందని రెండింటిని పోల్చుతూ ఫ్లెక్సీలపై ముద్రించారు. హైదరాబాద్ శివారున ఉన్న శంషాబాద్‌, బండ్లగూడ మండలాల్లో ఏ గ్రామాలకు ఎన్ని నిధులు అందాయి అనే విషయాలను స్పష్టంగా పోస్టర్లలో పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Drug Racket: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
CM Revanth Musi Revival Project: అగ్నిపరీక్షగా మూసి ప్రక్షాళన - మాటలకే ఇంత కాలం మరి చేతలెప్పుడు?
అగ్నిపరీక్షగా మూసి ప్రక్షాళన - మాటలకే ఇంత కాలం మరి చేతలెప్పుడు?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress PCC chief controversy: జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి - తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం - మంత్రి క్లారిటీ
జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి - తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం - మంత్రి క్లారిటీ
Nara Rohith : పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
Iran War Updates: ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
Divyang Shakti Scheme: దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Sara Ali Khan Kedarnath : కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
Sreeleela : ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే? - రంగస్థలం మహేష్‌పై సీరియస్ లుక్... శ్రీలీల రియాక్షన్
ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే? - రంగస్థలం మహేష్‌పై సీరియస్ లుక్... శ్రీలీల రియాక్షన్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
Top Petrol Scooters in India : ఎలక్ట్రిక్ యుగంలో పెట్రోల్‌ స్కూటర్లకు తగ్గని క్రేజ్‌- ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడల్స్ ఎన్ని? మీకు ఏ వాహనం సరిపోతుందో చూద్దాం!
ఎలక్ట్రిక్ యుగంలో పెట్రోల్‌ స్కూటర్లకు తగ్గని క్రేజ్‌- ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడల్స్ ఎన్ని? మీకు ఏ వాహనం సరిపోతుందో చూద్దాం!
Embed widget