అన్వేషించండి

Charminar Tragedy: సమ్మర్​ హాలిడేస్​‌తో పెరిగిన ప్రాణ నష్టం, మృతులలో బెంగాల్ వాసులే అధికం !

Hyderabad Fire Accident : చార్మినార్ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం 17 మంది చనిపోగా, మరో నలుగురు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చారని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు.

హైదరాబాద్: చార్మినార్ లోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి అధికారులు పలు లోపాలను గుర్తించారు. అగ్నిప్రమాదంలో మొత్తం 17 మంది మృతిచెందడం తెలిసిందే. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించడానికి ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఉదయం 6 నుంచి 6.15 గంటల సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. మొత్తం 21 మంది ఉండగా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు.

తలుపులు పగలగొట్టి రెస్క్యూ ఆపరేషన్
చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. లోపలికి వెళ్లే మార్గంలేక తలుపులు పగులగొట్టి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. గుల్జార్​ హౌస్‌ బిల్డింగ్​ప్రమాదంతో అక్కడ చాలా లోపాలు బటయపడ్డాయి. ఈ గుల్జార్​హౌస్​భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి అంతస్తులో వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. ఆ ఇంట్లో తరచూ విద్యుత్ సమస్య వస్తుందని అధికారులు గుర్తించారు. ఇరుకు మెట్లు, దట్టమైన పొగ కమ్ముకోవడంతో లోపలికి వెళ్లే మార్గం కనిపించలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఫైర్ సిబ్బంది చివరకు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లింది. మంటలు అంటుకున్న తరువాత లోపల చిక్కుకున్న వారికి బయటకు వచ్చేందుకు ఫైర్ ఎగ్జిట్ లాంటివి లేదని గుర్తించారు. ఒకే మార్గంలో ఇంటి లోపలకి వెళ్లాల్సి ఉంటుంది. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన రెస్క్యూ టీమ్ స్పృహ తప్పి ఉన్న పలువురిని బయటకు తీసుకొచ్చారు.

సమ్మర్​ హాలిడేస్​ తో పెరిగిన ప్రాణ నష్టం 
సమ్మర్ హాలిడేస్ కావడంతో వ్యాపారి ఇంటికి పలువురు బంధువులు వచ్చారు. వీరంతా బెంగాల్ నుంచి ఎక్కడికి వచ్చినట్లు సమాచారం. నిన్నటి వరకు అత్తాపూర్ లో ఉన్న మరికొందరు శనివారం సాయంత్రం చార్మినార్ లోని వ్యాపారి ఇంటికి వచ్చారు. అగ్నిప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం పెరగడానికి ఇదొక కారణమైంది. మృతులలో స్థానికంగా ఉండే వారి కంటే బెంగాల్ నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Charminar Tragedy: సమ్మర్​ హాలిడేస్​‌తో పెరిగిన ప్రాణ నష్టం, మృతులలో బెంగాల్ వాసులే అధికం !

ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం

ఏసీలో షార్ట్ సర్క్యూట్ తర్వాత గ్యాస్ లీకై ఇంట్లో ఉన్న ఎల్పీజీ సిలిండర్ పేలిపోయింది. ఇంట్లో ఉన్న చెక్క వస్తువుల కారణంగా వంటలు వేగంగా వ్యాపించాయి. ఇంట్లో దట్టమైన పొగ చేరడంతో పాటు ఒకే మెట్ల మార్గం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనలను ఉపయోగించి ఫస్ట్​ ఫ్లోర్​కు  వెళ్లారు. అప్పటికే స్పృహ తప్పి పడి ఉన్న 17 మంది ని బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ లలో పలు హాస్పిటల్స్కు తరలించారు. వారిలో కొంతమంది మార్గమధ్యలోనే మృతిచెందగా, కొందరు చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 17 కు చేరుకుందని అధికారులు తెలిపారు. పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు ప్రధాని మోదీ. మంత్రులు పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి బాధితుల కుటుంబసభ్యులను పరామర్శించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Telangana Assembly Budget Session: ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Akshay Kumar: నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
Telangana Assembly Budget Session: ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Weight Loss Journey : మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
Embed widget