అన్వేషించండి

Kishan Reddy Comments: కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం అనేది, పదేళ్లలో అతిపెద్ద జోక్: కిషన్ రెడ్డి

Kishan Reddy Comments: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడమనేది ఈ పదేళ్లలోనే అతిపెద్ద జోక్ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉట్టికి ఎగరనోడు, ఆకాశానికి ఎగురుతాడా అంటూ వ్యాఖ్యానించారు. 

Kishan Reddy Comments: కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం అనేది ఈ పది సంవత్సరాల్లోనే అతిపెద్ద జోక్ అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉట్టికి ఎగరనోడు... ఆకాశానికి ఎగిరాడట అంటూ కామెంట్లు చేశారు. దళితులను ధగా చేసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలవబోతున్నారన్నారు. పరిపాలించే సత్తా లేనోడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. ప్రధాని మోదీపై కల్వకుంట్ల కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. దేశంలో కుటుంబ పాలన తేవాలని... కుటుంబ పార్టీలన్నిటిని కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలన తీసుకు రావడమే ప్రధాని మోదీకి తెలుసని వివరించారు. ఎన్డీఏకు ఎప్పటికీ కేసీఆర్ ప్రత్యామ్నాయం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

అప్పుల తెలంగాణగా మార్చారు.. 
కేసీఆర్ కు ఉన్నదే 7 సీట్లేనని వాటితో ఆయన ఏం చేస్తాడో మీరో ఆలోచించంచండంటూ కిషన్ రెడ్డి కామెంట్లు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కు 17 స్థానాల్లో ఒక్క సీటు కూడా రాదని తెలిపారు. పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు, గల్లి నుంచి ఢిల్లీ వరకు... 130 కోట్ల మంది ప్రజలతో జాతీయ జెండాను ఎగరవేసిన చరిత్ర బీజేపీది అని తెలిపారు. సీఎం కీసీఆర్ ది అతిపెద్ద అవినీతి కుటుంబం అని ఆరోపించారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికే చెందుతుందన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదని ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగులు ఎవరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని తెలిపారు. ట్రాన్స్కో, జెన్కోలకు ఈ ప్రభుత్వం రూ.40 వేల కోట్లు అప్పు ఉందని స్పష్టం చేశారు. 

కుర్చీలో ఉంది కేసీఆర్ యే అయినా స్టీరింగ్ మాత్రం మజ్లిస్ చేతిలోనే.. 
బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టదని.. తప్పకుండా కేసీఆర్ అవినీతికి మీటర్లు పెడుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఏం చేశాడని దేశవ్యాప్తంగా కేసీఆర్ పాలన కావాలని ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని అడిగారు. దళితులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కేసీఆర్ ది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ ఏమైందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది అని తెలిపారు. కేజీ టు పీజీ హామీ ఏమైందన్నారు. సంక్షేమ హాస్టల్లో రాళ్లతో అన్నం పెడుతున్నారన్నారు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు మరణిస్తున్న ఘటనలను చూస్తున్నామన్నారు. మజ్లిస్ కు, ఓవైసీకి భయపడే పార్టీ బీజేపీ కాదని తెలిపారు. కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నా స్టీరింగ్, బ్రేక్ ఓవైసీ చేతిలోనే ఉందని విమర్శించారు. ఇలాంటి పాలనేనా దేశానికి కావాల్సిందన్నారు. 

బీజేపీ అధికారంలోకి వచ్చాకే మోడల్ అంటే తెలుస్తుంది.. 
కేసీఆర్ జాతీయ పార్టీ అనేది ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎనిమిదవ నిజాం అంటూ విమర్శించారు. కేసీఆర్ లాంటి అరాచక వ్యక్తి, అవినీతి పరుడు ఇంకెవరూ లేరన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణను దోచుకున్నది సరిపోదని.. బీజేపీ యేతర పార్టీలకు కేసీఆర్ ఎలా డబ్బులు పంపిస్తున్నాడో ప్రజలందరికీ తెలుసని కామెంట్లు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో చెల్లని రూపాయి .. మరి దేశంలో ఈ రూపాయి ఎలా చెల్లుతుందని అడిగారు. కేసీఆర్ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలంగాణ మోడల్ అంటే ఏంటో... బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు తెలుస్తుందన్నారు. ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం.. ప్రజలకు అందుబాటులో లేకపోవడమేనా 'తెలంగాణ మోడల్'  అంటే అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ను ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు. లక్ష మంది కేసీఆర్ లు, లక్ష మంది ఓవైసీలు వచ్చినా... 2024లో అధికారంలోకి వచ్చేది బీజేపనే అని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget