అన్వేషించండి

BJP MLA Raja Singh: ఉగ్ర ముప్పు ఉంటే ఇలాంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తారా?: ఎమ్మెల్యే రాజా సింగ్ అసహనం

Goshamahal MLA Raja Singh: ఉగ్రముప్పు ఉందని తెలిసి ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంటే తనకు ఇలాంటి వాహనం ఇస్తారా అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ముప్పు పొంచి ఉందన్న క్రమంలో కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచుగా రిపేర్ చేయించాల్సి వస్తుందని తెలిపారు. దీనిపై రాజా సింగ్ మాట్లాడుతూ.. తనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరించిందని, దాంతో అధికారులు బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం కేటాయించినట్లు చెప్పారు.

మొదట నాలుగు నెలల కిందట బుల్లెట్ ప్రూఫ్ వాహనం రోడ్డు మధ్యలోనే ఆగిపోతే రిపేర్ చేయించడానికి ఇంటెలిజెన్స్‌ కార్యాలయానికి పంపించాను. రిపేర్ చేసి మళ్లీ తనకు ఇచ్చినా పరిస్థితిలో ఏ మార్పు లేదన్నారు.  నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ రెండు నెలల క్రితం మళ్లీ ఆగిపోయిందని తెలిపారు. దాంతో చేసేదేమీ లేక గన్ మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. ఓసారి అఫ్జల్‌గంజ్ వద్ద బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోతే సొంత వాహనంలో వెళ్లాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. 

ఇటీవల జైలు నుంచి విడుదల..
ఎమ్మెల్యే రాజా సింగ్ కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బుధవారం రోజు చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యారు. పీడీ చట్టం కింద చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న ఆయనకు పలు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఎలాంటి రెట్టగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ రాజాసింగ్ ను ఆదేశించింది. జైలు నుంచి విడుదల అయ్యే సమయంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించ వద్దని కూడా షరతు విధించింది. మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేసింది.  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని హైకోర్టు షరతు విధించింది.

బుధవారం సాయంత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయగానే రాజాసింగ్ భార్య ఉషాభాయి న్యాయవాదులతో కలిసి జైలుకు వెళ్లారు. అప్పటికే బెయిల్ ఆర్డర్ ఆన్ లైన్ ద్వారా జైలు అధికారులకు చేరడంతో నిమిషాల వ్యవధిలోనే రాజాసింగ్ ను విడుదల చేశారు. కోర్టు ఆదేశాల మేరకు.. ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కానీ ప్రజలకు అభివాదం చేస్తూ జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. రాజాసింగ్ విడుదల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కుషాయిగూడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజసింగ్ అనుచరులు, అభిమానులు ర్యాలీ తీసేందుకు విఫల యత్నం చేశారు. బాణాసంచా పేల్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జైలు ప్రధాన ద్వారం నుంచి దాదాపు అర కిలోమీటర్ వరకు ఎవరూ గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

శ్రీరాముడి దయ వల్లే క్షేమంగా బయటకొచ్చా..
అయితే కారులో వెళ్తున్న రాజాసింగ్ ను చూసిన అభిమానులు జైశ్రీరాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజాసింగ్ విడుదలతో మంగళ్ హాట్ లోని రాజాసింగ్ ఇంటి వద్ద ఆయన బంధువులు, స్నేహితులు సంబురాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలు చోట్ల ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. శ్రీరాముడు, గోమాత ఆశీర్వాదం వల్లే తాను క్షేమంగా బయటకు వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. తన అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన హిందువులు, అనుచరులు, మద్దతుదారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు వివరించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget