అన్వేషించండి
Advertisement
బండ్ల గణేష్ కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్నారా? లేదా? స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
ఎన్నికల్లో పోటీపై బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని ప్రకటించారు.
ఎన్నికల్లో పోటీపై బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు అవకాశం ఇస్తామని చెప్పారని, ఈసారి టికెట్ వద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమన్న ఆయన, అందుకోసం కోసం పనిచేస్తానన్నారు. తాను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదని, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయమన్నారు. తప్పకుండా అధికారంలోకి వస్తుందని, రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని ట్వీట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion