అన్వేషించండి

Bandi Sanjay: ఈ కుట్రలు కేసీఆర్ చేసినవే - బీజేపీ ప్రెసిడెంట్ మార్పుపై బండి సంజయ్ స్పందన

హైదరాబాద్ లో బుధవారం (జూన్ 28) సాయంత్రం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రచారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ స్పందించారు. ఎన్నికలు ఉన్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే ఉద్దేశం ఏమి లేదని స్పష్టం చేశారు. తాజాగా దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే బండి సంజయ్ విమర్శలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై ప్రచారం బీఆర్ఎస్ నేతలకు అలవాటు అయిపోయిందని, అధ్యక్షుడి మార్పు ఉంటుందో.. లేదో.. తాను జేపీ నడ్డాను అడిగి చెబుతానని సరదాగా మాట్లాడారు. లీకులకు కారణం ముఖ్యమంత్రి కేసీఆరే అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బుధవారం (జూన్ 28) సాయంత్రం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

సొంత పార్టీలో ఏం జరుగుతుందో చూసుకోకుండా పక్క పార్టీలో కుట్రలు చేస్తుండడం సీఎం కేసీఆర్ కు అలవాటే అని విమర్శించారు. ఈటల రాజేందర్ ను హత్య చేస్తానన్న వారిని ముందుగా అరెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ భద్రతపైన కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని అన్నారు. హత్య చేస్తానన్న వ్యక్తి బహిరంగంగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారని అన్నారు. బీజేపీ నేతలకు సక్రమంగా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బండి సంజయ్ అన్నారు.

బుధవారం (జూన్ 28) సాయంత్రం బండి సంజయ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లారు. 'మేరా బూత్ సబ్సే మజ్బూత్' కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంగా, విస్తారక్ లను నియమించిన నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల నుండి సుమారు 650 మంది విస్తారక్ లు నేడు తెలంగాణకు రైలులో వచ్చారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వారికి బండి సంజయ్ స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో వీరంతా తెలంగాణలో పర్యటించి, పోలింగ్ బూత్ ల వారీగా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమవుతారని బండి సంజయ్ ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Ippa Flower: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!

వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
TVS Bikes 2026: టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Ranveer Singh : చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
Embed widget